కేసీఆర్ దేశ్ కీ నేత ఎలా అవుతారు ? అవుతారా లేదా ? అన్న విషయం ఆయన రాజకీయ అడుగులను బట్టి ఉంటుంది. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటికే ఆయనకు దేశ్ కీ నేత బిరుదు ఇచ్చేశారు. అలా ఇవ్వడమే కాదు దేశం మొత్తం ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణలోనే కాదు యూపీలోనూ ఫ్లెక్సీలు పెట్టారు. చివరకు వారణాశిలోనూ పెట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. చాలా ఖర్చు పెట్టారు. ఇప్పుడు అది ముంబైకి చేరింది.
కేసీఆర ముంబై పర్యటనకు వెళ్తున్న సందర్బంగా అక్కడ నగరం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు టీఆర్ఎస్ నేతలు. ముఖ్యంకా కేసీఆర్ పయనించే మార్గంలో గులాబీ ఫ్లెక్సీలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయనను దేశ్ కీ నేతగా అభివర్ణిస్తూ ఎక్కువగా పోస్టర్లు వెలిశాయి. వీటిని అక్కడి నేతలు ఎవరైనా పెట్టారా అంటేలేదు.. తెలంగాణ టీఆర్ఎస్ నేతలే యాడ్ ఏజెన్సీలతో మాట్లాడుకుని పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తామే ఫ్లెక్సీలు పెట్టించామని చెప్పేలా తమ ఫోటోలు కూడాఉంచుకుని జాగ్రత్త పడుతున్నారు.
ఈ ఫ్లెక్సీల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే వారిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రధానంగా ఉన్నారు. చాలా ఫ్లెక్సీలో ఆయన ఫోటో ఉంటోంది. వీరి హడావుడి చూసి ఇతర టీఆఎస్ నేతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దేశ్ కీ నేతా ్న ిఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన ా ఇమేజ్ వస్తుందా.. అని సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. నిజానికి ప్రాంతీయ పార్టీల్లో అందరూ దేశ్ కీ నేతా అనిపించుకోవడానికి తంటాలు పడుతున్నవారే. కేసీఆర్ ఇమేజ్ బిల్డింగ్ ఫ్లెక్సీలు చూసి వారెవరికైనా కోపం వస్తే పరిస్థితి మారిపోతుంది.