మునుగోడు ఉపఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే టీఆర్ఎస్నే విజయం వరించింది. అయితే ఏపక్షంగా కాదు. పోరు హోరాహోరీగా సాగింది. ప్రతీ రౌండ్లోనూ ఈ ప్రభావం కనిపించింది. కొన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యత చూపించారు. అయితే టీఆర్ఎస్ చివరి రౌండ్లలో టీఆర్ఎస్ స్పష్టమైన హవా చూపించింది. చివరికి దాదాపుగా పధ్నాలుగు వేల ఓట్ల మెజార్టీతో కారు జోరు చూపించింది.
టీఆర్ఎస్ పార్టీకి లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. ఆ పార్టీకి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరేడు వేల ఓట్లు ఉంటాయి. అవన్నీ టీఆర్ఎస్కు పడ్డాయి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఓట్లు రాజగోపాల్ రెడ్డికి పడ్డాయి. కానీ ఈ సారి ఆ ఓట్లు టీఆర్ఎస్కు పడటంతో ఫలితం మారిపోయింది. వీలైనంత వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను ఆయన చీల్చగలిగారు..కానీ గెలిచింతగా కాదు.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టెన్షన్ ప్రారంభమయింది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కానీ తర్వాత నాలుగు రౌండ్లలో మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది. దీంతో ఉత్కంఠ పోరు తప్పదని తేలిపోయింది. ఆ తర్వాత వరుసగా టీఆర్ఎస్ అభ్యర్థే స్వల్పంగా అయినా ఆధిక్యత చూపిస్తూ వచ్చారు. చివరికి విజయం అందుకున్నారు. ఐదో రౌండ్ తర్వాతనే రాజగోపాల్ రెడ్డికి పరిస్థితి అర్థం అయిపోయింది. ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పన్నెండు రౌండ్ల తర్వాత ఓటమి అంగీకరించి.. టీఆర్ఎస్ అక్రమాలకుపాల్పడిందని.. నైతిక విజయం తనదేనని చెప్పుకున్నరాు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక.. అంగబలాలు సరిపోకవడంతో వెనుకబడిపోయింది. డిపాజిట్ దక్కించుకోవడం కష్టమైపోయింది. మొదటి రెండు రౌండ్ల తర్వాతనే పాల్వాయి స్రవంతి .. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కేఏ పాల్‌కు ఐదు వందలకుపైగా ఓట్లు వచ్చాయి.