ఈటల రాజేందర్ .. తాను రాజీ పడిపోవడానికి సిద్ధమని… టీఆర్ఎస్ హైకమాండ్‌కు సమాచారం పంపినట్లుగా.. టీఆర్ఎస్ నేతలు కొంత మంది ప్రచారం ప్రారంభించారు. అలాంటి సమాచారమే.. కొన్ని పత్రికలకు లీక్ చేసి.. పెద్ద పెద్ద కథనాలు రాయించారు. రాజకీయ పార్టీల రాజకీయ వ్యూహాలు అమలు చేయడానికి టూల్‌గా మారిపోయిందని విమర్శలు ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్‌లో ఓ పెద్ద కథనం రాశారు. బలహీనమైపోయిన ఈటల… తాను లొంగిపోవడానికి సిద్ధమని.. కేసీఆర్‌కు సందేశం పంపారనేది.. ఆ వార్తా కథనం సారాంశం. దీన్ని చూసి.. టీఆర్ఎస్లో కొంత మంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటే.. మరికొంత మంది ఈటల ఫ్యాన్స్.. రివర్స్‌లో రాశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈటల రాజేందర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు. ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు చేస్తే.. తనకు అంత మంచిదన్నట్లుగా ఉన్నారు. ఆయన ప్రతీ రోజూ.. కొత్త కొత్త నేతలతో భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ అసంతృప్త నేతల్ని ఆకర్షిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి.. కొత్తరాజకీయ పార్టీ మంతనాలు జరిపారు. కేసీఆర్ చెప్పినట్లుగా… రాజకీయ పునరేకీకరణ అనే పదాన్ని తాను కొత్తగా చేసి చూపిస్తున్నారు., కేసీఆర్ వ్యతిరేకులందరి పునరేకీకరణ చేసి.. తన సత్తా చూపించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై… ఉద్యమాల్లో నడిచిన వారికి సానుభూతి ఉండటం.. ఇతర పార్టీల్లోనూ ఆయనకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ఉండటం కలిసి వస్తోంది.
ఈటలపై వేటు… టీఆర్ఎస్లో ఇబ్బందికర పరిస్థితిని తెస్తుందని.. ఆయనపై వేసిన విచారణల్లో టీఆర్ఎస్ నేతల బాగోతం అంతా బయటకు వస్తుందన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఆవిచారణలు స్లో అయ్యాయి. కోళ్లఫారం భూముల విషయంలో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించినా ఇంత వరకూ నోటీసులు ఇవ్వలేదు. అదే సమయంలో..దేవరయాంజల్ భూముల విషయంలో ఐఏఎస్‌ల కమిటీ సైలెంట్ అయిపోయింది. ఇంకెంత ముందుకెళ్లినా ఈటలకు సానుభూతి పెరుగుతుందని టీఆర్ఎస్ అంచనా వేశారనిచెబుతున్నారు.
ఇప్పుడు ఈటలను బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈటల.. వరుసగా అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈటలతో కలిసి ఓ కొత్త పార్టీపై కసరత్తు చేస్తున్నామని దానికి రేవంత్ మద్దతు ఉందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో భట్టి విక్రమార్క్, డీఎస్‌తో పాటు మరికొంత మందితో ఈటల చర్చిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలో ఈటల అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి ఈటల టీఆర్ఎస్లోనేఉంటారని.. ఆయన రాజీకొస్తున్నారన్న వార్తలు ప్రచారం చేయిస్తున్నారని ఈటల వర్గీయులుచెబుతున్నారు. మొత్తానికి ఈటల విషయంలో.. రాంగ్ స్టెప్ పడిందని మాత్రం.. టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.