సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి… తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ దావోస్‌లో ఈగలు తోలుకుంటున్నారట. ఈ విషయాన్ని కేటీఆర్ సహచర మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారు. కేటీఆర్ తెలంగాణ కోసం పెట్టుబడుల వరద పారిస్తూంటే… ఎవరూ రాక… ఎవరూ పెట్టుబడులపై ఆసక్తి చూపించక జగన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో స్వయంగా కేటీఆరే ఏపీని నరకంగా అభివర్ణించారు.
అప్పుడు కూడా వైసీపీ పెద్దలు ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కేటీఆర్‌కు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. జగన్ అసలు నోరెత్తలేదు. పైగా దావోస్‌ల కలువగానే అపూర్వ సహాదరుల్లా ఫోటోలు తీసుకున్నారు. కేటీఆర్ వాటినిసోషల్ మీడియాలో పెట్టారు. అవి ట్రెండింగ్‌లో ఉండగానే ఇటు పువ్వాడ అజయ్ మరోసారి జగన్ పై విమర్శలు చేశారు. నిజానికి ఏపీ పెవిలియన్‌లో ఎలాంటి కార్యక్రమాలు జరగడంలేదు.
కాంగ్రెస్ సెంటర్లో జరిగే కార్యక్రమాలకు వెళ్తున్న జగన్ అక్కడ వారికి ఏపీ తరపున బ్యాగులు ఇచ్చి ఫోటోలు దిగి.. వాటిని తన పీఆర్ టీం ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయించుకుని.., వాటికి భేటీలని ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కాదు కదా అసలు ఏపీలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా బడా పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించడం లేదు. దీన్నే తెలంగాణ నేతలు కూడా ఎత్తి చూపిస్తున్నారు.