మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచితంగా వ్యవహరించిన ఎంఎల్ఎ శంకర్ నాయక్తో క్షమాపణలు చెప్పించడమే గాక అరెస్టు చేయడం చెప్పుకోదగిన విషయమే. ఒక ప్రజాప్రతినిధి జిల్లా అత్యున్నతాధికారిగా వున్న మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై అన్ని వర్గాల నుంచి అధికారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది గనక అనివార్యంగా ప్రభుత్వం చర్య తీసుకోవలసి వచ్చింది. అయితే ఆయననుే స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు కూడా. ఒక కలెక్టర్ ఫిర్యాదుపై ఎంఎల్ఎను అరెస్టు చేయడం అరుదైన ఘటనే. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలు ఎపిలోనూ తెలంగాణలోనూ గతంలోనూ వున్నాయి గాని ఇంత గట్టి స్పందన చూళ్లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంఎల్ఎ చింతమనేని ప్రభాకర్ ఎంఆర్వో వనజాక్షి పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిపించి ఆమెనే మందలించారు. ఇటీవల ఒక పోలీసు ఎస్ఐపై పాలక పక్ష ఎంఎల్ఎ ప్రవర్తన బాగాలేదని చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తే దాదాపు తిరుగుబాటు చేశారు. ఆర్టీఎ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను బెదిరించిన ఎంపి నానీ ఎంఎల్ఎ బోండా ఉమామహేశ్వరులతో కూడా సర్దుబాటు ధోరణిలో క్షమాపణ చెప్పించారే గాని కఠినంగా వ్యవహరించలేదు.
తెలంగాణలోనూ గతంలో ఇలాటి ఉదంతాలు వున్నాయి గాని అరెస్టుదాకా వెళ్లలేదు. శంకర్ నాయక్ విషయంలో నిక్కచ్చిగా వుండకపోతే మహిళలు జిల్లా అధికారులలో విశ్వసనీయత దెబ్బతింటుందని గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు భావించాలి. ఏమైనా అది మంచి సంకేతమే. మందలించారు. ఇటీవల ఒక పోలీసు ఎస్ఐపై పాలక పక్ష ఎంఎల్ఎ ప్రవర్తన బాగాలేదని చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తే దాదాపు తిరుగుబాటు చేశారు. ఆర్టీఎ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను బెదిరించిన ఎంపి నానీ ఎంఎల్ఎ బోండా ఉమామహేశ్వరులతో కూడా సర్దుబాటు ధోరణిలో క్షమాపణ చెప్పించారే గాని కఠినంగా వ్యవహరించలేదు. తెలంగాణలోనూ గతంలో ఇలాటి ఉదంతాలు వున్నాయి గాని అరెస్టుదాకా వెళ్లలేదు. శంకర్ నాయక్ విషయంలో నిక్కచ్చిగా వుండకపోతే మహిళలు జిల్లా అధికారులలో విశ్వసనీయత దెబ్బతింటుందని గ్రహించడం వల్లనే ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు భావించాలి. ఏమైనా అది మంచి సంకేతమే.