వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య.. గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లక ముందే ఆయన పేరు మార్మోగిపోతోంది ఏ గ్రామానికి వెళ్లినా అందరూ ఆయన వైపు చూసి ఆడంగులందరూ.. నోటికి కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారు. ఇక మగవాళ్లు అయితే.. రాజయ్య ప్రచారంలో ఏం చెబుతున్నాడో వినకుండా.. ఆయన మాట్లాడే విధానం … ఆడియో టేపులోలా ఉందా ..? లేదా..? అని చెక్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఆడియో టేపేమిటనుకున్నారు..! రాజయ్య ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని మూడు మనిషాల్లో బయట పెట్టేసిన ఆడియో బయటకు ఎలా వచ్చిందన్నది తర్వాత సంగతి కానీ.. అందులోని డైలాగ్స్ మాత్రం.. రాజయ్య రసికతను బయట పెట్టేస్తున్నాయి.
ఓ టీఆర్ఎస్ మండల స్థాయి మహిళా నేతతో జరిపినట్లు చెబుతున్న సరస సంభాషణల ఆడియో టేప్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయిపోయింది. సిగ్గు విడిచి మొత్తం మాట్లాసుకున్నారు.. రాజయ్యతో పాటు ఆ మహిళా నేత. వీరి మాటల్లో దయాకర్, వెంకటేశ్వర్లు అనే నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి వారెవరన్న విషయం.. వాళ్లకే తెలుసు. స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యకు అంత క్లీన్ ఇమేజ్ ఏమీ లేదు. చిలక్కొట్టుడు రాజయ్య అని కూడా అంటారని ప్రచారం తెలంగాణ తొలి ప్రభుత్వంలో దళిత కోటాలో ఉపముఖ్యమంత్రి పదవి పొందిన రాజయ్య… కేసీఆర్ ఆగ్రహానికి గురి కావడానికి ఎక్కువ రోజు పట్టలేదు. తనేం చేశాడో… ఇప్పటికీ బయటపడలేదు. అవినీతి ఆరోపణలు పేరు చెప్పి.. కేసీఆర్ బర్తరఫ్ చేసి పడేశారు. మామూలుగా అయితే రాజీనామా చేయమంటే ఎవరైనా చేస్తారు. కానీ కేసీఆర్ ఆ చాన్స్ కూడా ఇవ్వకుండా బర్తరఫ్ చేసేశారు. అయితే ఇప్పుడు మళ్లీ టిక్కెట్ ఇచ్చారు. అదే అందర్న ఆశ్చర్య పరిచింది.
ఇప్పుడు హఠాత్తుగా వైరల్ అయిన ఆడియో. ఎప్పటిది అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఎన్నికల సమయంలో బయటకు రావడంతో ఏం జరిగిందన్నదానిపై రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజయ్యకు టిక్కెట్ రావడం ఇష్టం లేని కొంత మంది టీఅర్ఎస్ నేతలే దీన్ని లీక్ చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని కేసీఆర్ వరకూ తీసుకెళ్లి టిక్కెట్ క్యాన్సిల్ చేయించడానికే దీన్ని బయటకు తెచ్చారని రాజయ్య వర్గీయులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజయ్య మాత్రం అధికారికంగా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఏ స్పందన వ్యక్తం చేసినా.. తన మీద కుట్ర చేస్తున్నారని మాత్రమే చేప్పుకోగలరు. కానీ పోయిన్ ఇమేజ్ మాత్రం రాదు కదా..! ప్రత్యర్థులకు కూడా కావాల్సింది అదే..!. అందుకే ప్రజాప్రతినిధిగా అత్యంత బాధ్యతగా ఉండాల్సిన రాజయ్య.. చిత్త చాంచల్యంతో పరాయి మహిళతో మాట్లాడిన మాటలు.. ఇప్పుడాయన రాజకీయ జీవితానికి గండంగా మారాయి.