నిన్న బుట్టా రేణుక టిడిపి లో చేరింది. కానీ ఆమె చేరినట్టా లేక చేరనట్టా అనే కన్ ఫ్యూజన్ అలా మిగిల్చేసింది. అయితే ఈ సందర్భంగా MLA ల “దూకుడు” (ఒక పార్టీ లో నుంచి మరో పార్టీ లోకి ఫిరాయింపు) కి , MP ల దూకుడు కి చాలా తేడా ఉంటుందనే నిజాన్ని మరో సారి తెలియజేసింది.
నిజానికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్ సీజన్ నడుస్తోంది. అధికార పార్టీల్లోకి దూకడం లో అన్ని విపక్షాల నేతలు ఒకరిని మించి మరొకరు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ మధ్య TRS లో కి విపక్షాల MLA లని కెసియార్ లాగేసుకుంటూ ఉంటే, ఒకటి, రెండు, మూడు అంటూ మగధీర లో షేర్ ఖాన్ లాగా లెక్కపెట్టుకుంటూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేక పోయాయి విపక్షాలు. ఇక్కడ జగన్ పరిస్థితి కూడా ఆల్ మోస్ట్ అదే. ఫిరాయించిన MLA లు చక్కగా కొత్త రంగు కండువాలు కప్పుకుని కప్పుకుని, తమ నియోజక వర్గాల అభివృద్ది కోసం మాత్రమే ఇలా రంగు మార్చామని ప్రకటించేసుకున్నారు. ఇక వీరి మీద ఏమైనా చర్యలు గట్రా తీసుకోవాలంటే అది స్పీకర్ పరిధి లో ఉంటుంది. ఆయన ఎప్పుడు చర్య తీసుకోవాలనేది ఆయన చేతుల్లో ఉంటుంది తప్ప, విపక్షాలు, మీడియా ఆయన్ని ఒత్తిడి చేయలేవు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, TRS లోకి జంపైన MP గుత్తా కానీ, నిన్న టిడిపిలో కి చేరిన బుట్టా కానీ కండువా కప్పుకోలేదు. MLA ల వలే దూకుడు ప్రదర్శించలేదు. ఎందుకో తెలుసా. MLA ల ఫిరాయింపు మీద చర్య తీసుకోవలసింది రాష్ట్ర స్పీకర్లు. వాల్లూ TRS, TDP కి సంబంధించిన వ్యక్తులే ఇదివరకు. కానీ MP ల విషయం లో చర్య తీసుకోవలసింది లోక్ సభ స్పీకర్. బిజెపి కి చెందిన వ్యక్తి, సుమిత్రా మహాజన్. ఆవిడ మీద TRS, TDP ల కి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఆధారాలున్నాయని అనిపిస్తే గబుక్కున డిస్-క్వాలిఫై చేయొచ్చు MP ల ని. అప్పుడు తక్షణమే (ఆర్నెల్ల లోపు ఎప్పుడైనా) ఖచ్చితంగా ఎన్నికలకి వెళ్ళాలి. అందుకే ఆధారాలు దొరక్కుండా ఈ తిప్పలు. అందులోనూ మన యాంటీ డిఫెక్షన్ షెడ్యూల్ ప్రకారం విపక్ష MLA, MP లు అభివృద్ది కోసం అధికార పార్టీ ని కలిసినా, వాళ్ళ అనుచరులు మాత్రమే జాయినయినా అది ఫిరాయింపు కిందలి రాదు. వారు స్పష్టంగా చెప్పాలి – మేము పార్టీ మారుతున్నాం అని. లేదా ఆ పార్టీ సభ్యత్వం తీసుకోవడమో, కండువా కప్పుకోవడమో చేయాలి. అప్పుడే మారినట్టు. ఇదిగో ఈ లూప్ హోల్ తోనే MP లు ఎస్కేప్ అవుతున్నారు. వారు అధికార పార్టీ కి చెందిన ముఖ్యమంత్రి ని కలుస్తారు. వారి అనుచర గణాన్ని అందులో చేరుస్తారు. తమ స్వంత పార్టీ కి వతిరేకంగా పనిచేస్తారు. కానీ కండువా కప్పుకోరు. అధికార పార్టీ సభ్యత్వం తీసుకోరు. “అఫీషియల్” రికార్డుల్లో ఎక్కడా తాము పార్టీ మారినట్టు మాట్లాడరు. టెక్నికల్ గా లోక్ సభ లో మొదటి పార్టీ ఎంపీలుగానే ఉంటారు. కానీ తమ పనులు మాత్రం (సారీ… తమ నియోజక వర్గాల పనులు) చక్కబెట్టుకుంటారు.
అదిరిందయ్యా “చంద్రం”…అనాలనిపిస్తోందా…!!!