హైదరాబాదులో అంగరంగ వైభోగంగా జరుగుతున్న టిఆర్ఎస్ 15వ వార్షికోత్సవ ప్లీనరీకి సంబంధించి ఆసక్తికరమైన వాస్తవం ఒకటి తెలియవచ్చింది. కొంపల్లిలో ప్లీనరీ జరుగుతున్న విశాలమైన స్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన బాబుగారిది. ఆయనకు ఇక్కడ ఊహకందని విస్తీర్ణంలో స్థలాలున్నాయి. ప్లీనరీ ఆతిధ్యంలో ఏర్పాట్లలో కూడా ఆయన ”వంతు” చాలా ఎక్కువగానే సేవలందిస్తున్నారు. టిఆర్ఎస్తో ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే ఆయన కోరిక. కెటిఆర్ తరచూ గోదావరి జిల్లాల వారి ఉత్సవాల్లో మాట్లాడడం, అక్కడి నుంచే పోటీ చేస్తానని చమత్కరించటం, ఆ ప్రాంతంలో కొందరు కెసిఆర్ పోస్టర్లు పెట్టడం వంటివి గతంలోనే వార్తలకెక్కాయి. ఇప్పుడు కీలకమైన ప్లీనరీ కూడా అక్కడే జరుగుతున్నదంటే గులాబి గోదావరి బంధం బలమెంతో తెలుస్తుంది. అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఇలాంటి సంబంధ బాంధవ్యాలు సంతోషించాల్సినవే.