టీఆర్ఎస్ ఆవిర్భావఉత్సవాలు సాదాసీదాగా జరగనున్నాయి. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ను ప్రకటించారు కేసీఆర్. ఈ ఏడాదికి 21 ఏళ్లు అవుతుంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం గత అక్టోబర్లోనే ప్లీనరీ నిర్వహించేశారు. ఓ బహిరంగసభ నిర్వహిద్దామనుకున్నా కుదరలేదు. ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర మంత్రి వర్గం, ఎంపీల దగ్గర్నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ల వరకూ పదవుల్లో ఉన్న వారు… ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు. వారితోనే ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీలో పదకొండు తీర్మానాలు పెట్టి ఆమోదిస్తారు. కేసీఆర్ ప్రసంగిస్తారు. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలకు ముందే హెచ్ఐసీసీలోనే ప్లీనరీ నిర్వహించారు. మరోసారి నిర్వహిస్తున్నారు. ఈ సారి ఆవిర్భావ దినోత్సవానికి బహిరంగసభ పెడతారేమో అనుకున్నారు. గతంలో “దేశం మొత్తం తిరిగి చూసే” సభను నిర్వహించాలని ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో వాయిదాలు పడింది.
అయితే “దేశం మొత్తం తిరిగి చూసే” సభను మాత్రం నిర్వహిస్తారని.. అది ఎప్పుడు అనేది కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సాదాసీదా ప్లీనరీ .. పార్టీ నేతల జెండాల ఆవిష్కరణతోనే సరిపెట్టబోతున్నారు.