గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని అలా వదిలేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు మనస్కరించలేదు. ఎలాగోలా పీఠంపై గులాబీ నేతను కూర్చోబెట్టాల్సిందేనని డిసైడయ్యారు. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా.. పాత కార్యవర్గానికి ఇంకా సమయం ఉందని.. దాటవేస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ… ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన డెడ్ లైన్ వచ్చే సరికి.. మేయర్ ఎన్నిక నిర్వహించడానికి సిద్ధపడింది. ఫిబ్రవరి పదకొండో తేదీన మేయర్ ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఉదయం కార్పొరేటర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక ఉంటుంది.
మేయర్ ఎన్నికలో కార్పొరేటర్లు కాకుండా… వేరే చోట ఎక్కడా ఎక్స్ ఆఫీషియో ఓటు వినియోగించుకోని ఎమ్మెల్సీలు, ఇతర అర్హులైన ప్రజాప్రతినిధులు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చు. ఇలాంటివారందర్నీ ఎక్స్ ఆఫీషియో ఓటర్లుగా గుర్తిస్తారు. వారికి ఓటు హక్కు కల్పిస్తారు. ఇలాంటి వారు టీఆర్ఎస్కు ఎక్కువే ఉన్నారు. అయితే.. కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో ఓటర్లు కలిసినా… మ్యాజిక్ మార్క్ కావాల్సిన వంద దాటడం లేదు. ఈ కారణంగా మేయర్ ఎన్నికను నిర్వహించరని.. ప్రత్యేక అధికారుల పాలనను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది.
వాస్తవానికి గ్రేటర్లో మేయర్ సీటు దక్కించుకునేందుకు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే చాన్స్ ఉంది. ఇంకెవరికీ లేదు. అయితే ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఎఁఐఎం సాయం చేయాల్సి ఉంటుంది. మజ్లిస్ మద్దతివ్వడమో… అసలు ఎన్నికకు దూరంగా ఉండటమో చేయాల్సి ఉంది. ఎలా చేసినా… మజ్లిస్ సాయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిటీఆర్ఎస్కు ఇష్టం లేదు. అందుకే…మేయర్ అభ్యర్థిని ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్దతిలో మార్పులు చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మేయర్ అభ్యర్థిగా బరిలో నిలబడిన వారిలో ఎవరికి ఎక్కువ మంది మద్దతు ఉంటే వారికే మేయర్ సీటులభించేలా నిబంధనలు మార్చేచాన్స్ ఉంది. ఇలా చేయడం వల్ల.. అత్యధిక మంది మద్దతు ఉన్న టీఆర్ఎస్కు మేయర్ పీఠం దక్కుంది. మజ్లిస్ నీడ పడకుండా ఉంటుంది.