తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీవీ చానళ్లలో చర్చలకు వెళ్తే .. పార్టీ నేతలను సస్పెండ్ చేయాలని డిసైడయ్యారు. దీనికి కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. హఠాత్తుగా.. కేసీయార్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. నేతలెవరూ.. టీవీ చానళ్లలో జరిపే రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నిర్ణయం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్క సారిగా.. కేసీఆర్… ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.
ప్రైమ్ టైమ్ అయితే.. టీవీ చానళ్లలో.. చర్చా కార్యక్రమాలు మాత్రమే నడుస్తాయి. ఏదో ఓ టాపిక్ తీసుకుని.. అన్ని పార్టీల నేతలను పిలిచి చర్చలు పెడతాయి. అందులో.. నేతలు వాదోపవాదాలు చేసుకుంటారు. అంతటితో అయిపోతాయి. రాజకీయాలంటే ఇష్టపడేవారికి అవో ఎంటర్టెయిన్మెంట్లా మారాయి. టీవీ చర్చల్లో జోరుగా.. ప్రతిభావంతంగా తమ వాదన వినిపిస్తే.. పార్టీలోనూ గుర్తింపు వస్తుందని నేతలు కూడా ఉత్సాహం చూపిస్తారు. అయితే.. ఇప్పుడు.. టీఆర్ఎస్ నేతలు.. ఎవరూ.. టీవీల్లో కనిపించడానికి అవకాశం లేకుండా.. కేసీఆర్ కట్టడి చేశారు.
కేసీఆర్ నిర్ణయం.. టీఆర్ఎస్ నేతలకు.. ఆశ్చర్యం కలిగించేదే..! ఎందుకంటే… ఇప్పుడు ఉన్న టీవీ చానళ్లలో మెజార్టీ.. టీఆర్ఎస్కు మద్దతుగానే ఉన్నాయి. పెద్దగా వ్యతిరేకత వార్తలు.. కానీ.. వ్యతిరేక చర్చలు కానీ.. పెట్టడం లేదు. అంతా అనుకూలంగా ఉన్నా.. ఎందుకని.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. కొంత మంది.. తమకు ఎదురులేదన్న భావనతో… వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూండటంతో .. తలనొప్పులు ఎందుకని… కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు.