టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్గా మారడం ఇన్‌స్టంట్‌గా అయ్యే పని కాదని గులాబీ నేతలకు తెలిసి వచ్చింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేసి.. ఆరో తేదీన ఈసీకి అందచేశారు. కానీ ఈసీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల నిర్వహణలో తీరిక లేకుడంా ఉంది. అదే సమయంమలో నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. దాన్ని కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చాలంటే ఈసీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే అనుమతి లభించడం కష్టమే. డిసెంబరు 8వ తేదీ వరకు అసెంబ్లీ ఎన్నికల బిజీలో కమిషనర్లు ఉంటున్నందున ఆ తర్వాత మాత్రమే బీఆర్ఎస్ ఫైల్‌కు సంబంధించిన సీరియస్ యాక్టివిటీ మొదలవుతుందని భావిస్తున్నారు. అలా చేసినా ఈసీ కొన్ని నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. అది అయ్యే సరికి మూడు నెలల సమయం పట్టవచ్చనేది ప్రాథమిక అంచనా.
బీఆర్ఎస్ మారుస్తూ తీర్మానం చేసిన వెంటనే. టీఆర్ఎస్ వర్గాలు.. ఢిల్లీలో బహిరంగసభపై లీకులు ఇచ్చాయి. ఢిల్లీ వేదికగానే జాతీయ పార్టీ ఆవశ్యకత, జెండా, ఎజెండా, విధివిధానాలు, పాలసీ తదితరాలను కేసీఆర్ వివరించాలనుకుంటున్నారని అందు కోసం రామ్‌లీలా మైదానంలో డిసెంబరులో భారీ స్థాయిలో సభను ఏర్పాటు చేసి దానికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు డిసెంబరు 9న సభ ఉండే అవకాశం ఉందన్న హింట్ కూడా ఇచ్చారు. కానీ బీఆర్ఎకు సంబంధించిన పేరు మార్పు ప్రాసెస్‌కు ఈసీ దగ్గర సమయం పట్టే అవకాశం ఉన్నందున ఢిల్లీలో కేసీఆర్ సభ కూడా ఆ తర్వాతే జరగనుంది.
అయితే మూడు నెలలు గడిచిపోయే సరికి… బీఆర్ఎస్ పై అందరికీ ఆసక్తి తగ్గిపోతుందేమోనని టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే కేసీఆర్ కు ఎలా హైప్ క్రియేట్ చేయాలో.. ఎలా ప్రజల్లో చర్చ పెట్టాలో తెలుసని అంటున్నారు.