గతేడాది వచ్చిన మంచి సినిమాల్లో, మంచి ప్రేమకథల్లో ‘బేబీ’ ఒకటి. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం కల్ట్ జాబితాలో నిలిచి నిలిచిపోయింది. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి మరో లవ్ స్టోరీ వస్తోంది. అదే.. ‘ట్రూ లవర్’. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కే.ఎన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. టీజర్ ఇప్పుడు వదిలారు. టైటిల్ కి తగ్గట్టుగానే, ఓ నిజమైన ప్రేమికుడి కథ ఇది. ఆరేళ్లుగా ఓ అమ్మాయిని సిన్సియర్‌గా ప్రేమిస్తే, చివరికి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ తరవాత ఆ ప్రేమికుడు పడిన వేదన అంతా ఈ టీజర్లో కనిపించింది.
డైలాగ్స్ లోనూ, హీరో క్యారెక్టరైజేషన్‌లోనూ మాస్ కి నచ్చే విషయాలు కనిపిస్తున్నాయి. ‘బేబీ’లో అమ్మాయిలపై ఎలా సెటైర్లు పడ్డాయో.. ఈ సినిమాలోనూ అలాంటి సెటైర్లు పడబోతున్నాయని అర్థమవుతోంది. లవ్ స్టోరీలో పెయిన్ ఉంది. దాన్ని రియాలిటీకి ఎంత దగ్గరగా చూపిస్తే… యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సుంది. మణికందన్, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించారు. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. సీన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. చాలా కాలం తరవాత ఓ చిన్న సినిమాకి, అందునా డబ్బింగ్ సినిమాకి మారుతి పేరు ప్రజెంట్ గా పడింది. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. సో… చిన్న సినిమా అయినా, బ్లాస్ట్ గట్టిగానే వినిపించేట్టు కనిపిస్తోంది.