నిండు జీవితానికి రెండు చుక్కలు అని.. పోలియో డ్రాప్స్ గురించి ఇండియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. అమెరికాలో ఇదే ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే.. పోలియో డ్రాప్స్ గురించి కాదు.. కరోనా ట్యాబ్లెట్ల గురించి. కరోనా రాకుండా ఉండాలంటే.. ప్రతీ రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ వేసుకోవాలని ప్రజలకు ప్రాక్టికల్ సలహాలు ఇస్తున్నారు. తాను ప్రతీ రోజూ.. ఓ హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్‌ను వేసుకుంటున్నానని ట్రంప్ ప్రకటించి… కలకలం రేపుతున్నారు. కరోనా రాకుండా.. ఆ టాబ్లెట్ మాత్రమే కట్టడి చేస్తుందని అంటున్నారు. ప్రివెంటివ్ మెడిసిన్‌గా సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు.
అమెరికాలో మొదట్లో కరోనా కే్సులు వెలుగు చూసినప్పుడు.. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియని వైద్యులు.. అనేక రకాల ప్రయోగాలు చేశారు. అలా చేస్తున్న సమయంలో.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ ను ఇచ్చిన ఓ రోగికి వెంటనే నయమయింది. కరోనా నెగెటివ్ వచ్చేసింది. దాంతో.. ట్రంప్‌కు నమ్మకం పెరిగిపోయింది. కొన్ని పరిశోధనల్లో.. మిగతా వాటి కంటే… క్లోరోక్విన్ బెటర్ అని తేలింది. అంతే.. కరోనాను.. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ నిరోధిస్తుందని.. ట్రంప్ మైండ్‌లో ముద్ర పడిపోయింది. అంతే.. ఆయన బ్లైండ్‌గా ముందుకెళ్లిపోతున్నారు. చివరికి ఈ టాబ్లెట్ల కోసం ఇండియాతో గొడవ పెట్టుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. కావాల్సినన్ని పంపిన తర్వాతే ఆయన కూల్ అయ్యారు.
అయితే అమెరికా ఎఫ్‌డీఏ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సైడ్ ఎఫెక్టుల గురించి హెచ్చరించింది. డాక్టర్ల సూచనలు లేకుండా.. ఆ టాబ్లెట్లు వేసుకుంటే… శరీర అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఆయన మాత్రం.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రమోట్ చేయడం మాత్రం మానుకోలేదు. తానే స్వయంగా వేసుకుంటున్నానని చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇండియా నుంచి క్లోరోక్విన్ టాబ్లెట్లను దిగుమతి చేసుకున్నాయి కానీ.. తమ తమ వైద్యుల సలహా మేరకు కరోనా రోగులకు ఇస్తున్నాయి. ట్రంప్‌లా… కరోనా రాకుండా అదే మందు అని ప్రచారం చేయడం లేదు. కొన్ని దేశాలు.. సైడ్ ఎఫెక్టులు ఎక్కువగా ఉన్నాయని.. ఆ టాబ్లెట్ వాడకాన్ని తగ్గించాయి.