అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. ఆయన గురించి.. ఆయన ప్రయాణించే విమానాల గురించి.. ఆయన లగ్జరీ గురించి… ఓ వర్గం… విశేషణాలు వెదుక్కుని మరీ వర్ణిస్తూండగా… మరో వర్గం.. ఆయన అసలు ఎందుకొస్తున్నారు..? అగ్ర రాజ్యాధినేతగా ఆయన వస్తూ…ఇండియాకు ఏం తెస్తున్నారన్న చర్చ లేవనెత్తుతున్నారు. మరో వైపు.. అమెరికా అధ్యక్షుడి కోసం.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు… అనేక రకాల విమర్శలకు గురవుతున్నాయి. కేంద్రం… ఏదో.. ఆయన వస్తే..భారత దేశం దశ తిరిగిపోతుందన్నట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. ఆయన జరిపే కొద్ది గంటల పర్యటనల కోసం.. కోట్లు వెచ్చిస్తోంది. పేదరిక కనబడకుండా గోడలు కట్టిస్తోంది. అగ్రా, అహ్మాదాబాద్లలో శరవేగంగా సుందరీకరణ చేశారు. అయితే.. ఆ మొత్తం నిధులతో… కొన్ని మురకీవాడలను సమూలంగా మార్చేయవచ్చన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
ఓ వైపు.. రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు ఇచ్చే విందులో ఏం ఉండబోతున్నాయో… కూడా.. హైలెట్ అవుతోంది. అయితే.. అది ప్రతీ సారి కామనే.. కానీ ఈ సారి మాత్రం… హైలెట్ అవుతోంది… ట్రంప్‌నకు… పెట్టే తిండి మాత్రమే కాదు.. ఆయనకు దేంట్లో వడ్డిస్తారనేది కూడా… కీలకమే. ఆయనతో పాటు.. ఆయన కుటుంబసభ్యులకు… బంగారు ప్లేట్లలో వడ్డించబోతున్నారని కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. తినేది, తాగేది మొత్తం.. గోల్డ్ ప్లేట్లు, గ్లాసులేనని చెబుతున్నారు. ఇతర విశిష్ట అతిధులకు కూడా.. వెండి ప్లేట్లు, గ్లాసులు వాడతారని చెబుతున్నారు.
భారతదేశం పేద దేశం కాదని.. ట్రంప్ అభిప్రాయం. అందుకే.. దిగుమతులపై ఆయన పన్నులు పెంచుకుటూ పోతున్నారు. ఇప్పుడు… భారత్ చాలా ధనికదేశమంటూ ఆయనకు బంగారు ప్లేట్లలో వడ్డిస్తే.. ఆ విషయాన్నే రేపు అంతర్జాతీయంగా వాడుకుంటారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. లేని పోని గొప్పల కోసం.. ట్రంప్‌కు స్థాయికి మించిన అతిధి మర్యాదలు చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ ఇండియాకు .. వచ్చి భారత్ కు తాము చేస్తున్న దిగుమతులపై పన్ను మినహాయింపులు డిమాండ్ చేయబోతున్నారు. అంటే.. ఏదో ఓ ప్రయోజనం ఇండియా నుంచి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ… కేంద్రం మాత్రం మీ రాక మాకెంతో సంతోషమండి అన్నట్లుగా … కోట్ల కొద్దీ ఖర్చుతో అతిధి మర్యాదలు చేస్తోంది.