ట్రంప్ కట్టుకున్న టై… సబర్మతి ఆశ్రమంలో ఆయన పెట్టిన సంతకం.. అన్నీ… ప్రత్యేకమే. ఆయన లగ్జరీ ఏంటి..? ఆయన లైఫ్ స్టైల్ ఏంటి..? అన్న విషయాలను పక్కన పెడితే.. ఆయన టూర్లో రెండు అంశాలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. అందులో ఒకటి ఆయన కట్టు ఎల్లో టై. తన మార్క్ సూటు, బూటుతో అహ్మదాబాద్లో ఎయిర్ఫోర్స్ వన్ దిగిన ట్రంప్ ఆహార్యంలో తేడా కనిపించింది. ఆ తేడా టై. ఆయన ఎప్పుడూ ఎర్ర రంగు టై వాడతారు. ముఖ్యంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు.. పూర్తిగా ఎర్ర రంగు టైనే వాడతారు. ఓ రకంగా అది పవర్ సింబల్ లాంటిది. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అమెరికా అధ్యక్షులు ఆ కలర్ టైని చిహ్నంగా వాడుతారని చెప్పుకుంటారు.
భారత పర్యటనలో ఎల్లో టైని వాడటం…హాట్ టాపిక్ అయిపోయింది. భారత్లో ట్రంప్.. సన్నిహిత మిత్ర దేశంగా చూస్తున్నారని.. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే..దీన్ని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు.. తమిళనాడు, ఏపీ రాజకీయ పార్టీల కార్యకర్తలు. తమిళనాడులో డీఎంకే ఫ్యాన్స్.. తమ పార్టీకి.. ట్రంప్ మద్దతుగా ఆ టై వేసుకొచ్చారని.. విజిల్ పోడు.. అంటూ హోరెత్తిస్తున్నారు. ఆ పార్టీ రంగు కూడా పసుపే. సోషల్ మీడియాలో టీడీపీ ఫ్యాన్స్..ట్రంప్ ప్రజారాజధానికి మద్దతుగా నిలిచారని ప్రచారం ప్రారంభించారు. ఈ కామెడీకి తోడు..సబర్మతి ఆశ్రమంలో తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ట్రంప్ పెట్టిన సంతకం..మరింత వైరల్ అయింది.
సబర్మతి ఆశ్రమం పుస్తకంలో ‘ టు మై గ్రేట్ ఫ్రెండ్ .. ప్రైమ్ మినిస్టర్ మోదీ… థాంక్యూ ఫర్ దిస్ వండర్ ఫుల్ విజిట్’ అని రాశారు. అంత వరకూ బాగానే అర్థం అయింది. ఆ తర్వాత పెట్టిన సంతకాలు మాత్రం ఈసీజీ రిపోర్ట్ ను పోలి ఉన్నాయి కానీ..దాన్ని సంతకం అని ఎవరూ అనుకోలేరు. మొత్తానికి ట్రంప్.. తన ఇండియా పర్యటనలో.. ప్రత్యేకతల్ని చూపిస్తున్నారు.