ఇవిఎంలను హాకింగ్ చేస్తామంటూ వచ్చిన ఎన్సిపి,సిపిఎంలు విఫలమైనాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఎన్నికల సంఘం(ఇసి) ఇచ్చిన సమాచారమే దీనికి ఆధారం. అయితే సిపిఎం విడుదల చేసిన ప్రకటనతో అసలు సంగతి బయిటకు వచ్చింది. ఇవిఎంల సాఫ్ట్వేర్ పనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి ఇసి సిద్దంగా లేదు. హార్డ్వేర్ మార్చకూడదన్న మాటతో పార్టీలు ఏకీభవించాయి. కాని సాఫ్ట్వేర్ ప్రక్రియలు తెలియకుండా ఎవరూ హాక్ చేయలేరు. అధికారంలో వున్న వారు ఇవన్నీ తెలిసి దుర్వినియోగంచేస్తున్నారని తప్ప హాకింగ్తో చేస్తున్నారని ఎవరూ అనడం లేదు. . ఇసి వాదన ప్రకారం ఈ దశలో వివరాలు వెల్లడించడం కుదరదు. దానికి మరో దశ వుంటుందో లేదో తెలియదు. కనుక కొన్ని ప్రాథమిక సాంకేతిక అంశాలు వెల్లడించకుండా సవాళ్లు చేయడం అర్థరహితమే. బ్యాలెట్ పత్రాలకంటే ఇవిఎంలు మెరుగని అందరూ అంగీకరిస్తారు. అయితే వీటిపై సందేహాలు నివృత్తి చేయాలంటే మొత్తం సమాచారం పంచుకోవాలి గాని సగం సగం సవాళ్ల వల్ల వొరిగేదేమిటి? ఒకప్పుడు తెలుగుదేశం తరపున ఒక సాంకేతిక నిపుణుడు ఇవిఎంను అపహరించి ఎలా హాక్ చేయొచ్చునో చూపించిన మాట నిజం.దానికి అతన్ని శిక్షించారు కూడా. ఆ విధంగా మీరు వాడేవి విప్పి చూపించాలి గాని వూరికే బటన్లు నొక్కి క్లిక్ చేసి మార్చండంటే ఎవరూ చేయగలిగింది వుండదు.