ఐదు నెలల నుంచి గుర్తుకు రాని రమణదీక్షితులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..? ఆయనకు ఆగమ సలహాదారు పదవి .. ఆయన కుమారులకు.. తిరుమలలో అర్చకుల పదవులు ఎలా వచ్చాయి..? వారంలో ప్రధాన అర్చకుడు అవుతారంటూ.. జగన్ హామీ ఇచ్చారని ఆయన ఎలా చెప్పుకుంటున్నారు..?… ఇదందా.. ఎల్వీ మాయ. నేరుగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సంబంధం లేదు … కానీ.. ఆయనతో టచ్ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం తొలగించింది. అసలే అప్పుడు అది ఎన్నికల వేడి పెరుగుతున్న సమయం. దాంతో.. ఆయన చంద్రబాబుపై చేసిన విమర్శలు….టీడీపీని బ్రాహ్మణ వ్యతిరేకిగా ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఐవైఆర్.. జగన్ మీడియా గ్రిప్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు.. అచ్చంగా అలాంటి పరిస్థితిని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని గెంటి వేయడం ద్వారా.. జగన్ తెచ్చుకున్నారు. ఆయనపై.. బ్రాహ్మణ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా.. రమణదీక్షితులను ఉపయోగించుకున్నారు.
ఎల్వీని అత్యంత ఘోరంగా జగన్ అవమానించిన విషయం.. బ్రాహ్మణవర్గంలోకి గట్టిగా వెళ్లింది. దానికి కారణాల్లో .. క్రిస్టియన్లు సంబరాలు చేసుకోవడం కూడా ఒకటి. బ్రాహ్మణులు ఆగ్రహం కట్టలు తెంచుకోక ముందే దిద్దుబాటు చర్యల్లో భాగంగానే.. అయిదు నెలలుగా గుర్తురాని రమణదీక్షితులు ఒక్కసరిగా ప్రభుత్వానికి గుర్తుకు వచ్చారు. రెండు సార్లు పాలక మండలి సమావేశం జరిగినా… ఆయన విషయాన్ని చర్చించడానికి కూడా ఇష్టపడలేదు. కోర్టుల్లో కేసులున్నాయంటూ.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఎల్వీ ఇష్యూలో బ్రాహ్మణుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఉన్నపళంగా ఆయనను ఆగమ శాస్త్ర సలహమండలి సభ్యులుగా నియమించారు. లూప్ లైన్లో ఉన్న మరో బ్రహ్మణ ఐఏఎస్ జేఏస్వీ కు టీటీడీ ఇవో పదవి ఇస్తారనే లీకులు ఇప్పించారు.
బ్రాహ్మణ వర్గాన్ని మంత్రులు మరింత కించపరచడం… వైసీపీ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. జీతం తగ్గించలేదు కదా.. అంటూ.. బొత్స సత్యనారాయణ వెటకారాలు ఆడటం.. ఇతర ముంత్రులు.. ఎల్వీ ఏదో.. చేయరాని తప్పు చేశారన్నట్లుగా మాట్లాడుతూండటంతో.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. బ్రాహ్మణ వర్గాల్లో.. కోపం తగ్గడం లేదన్న మాట సెక్రటేరియట్లో వినిపిస్తోంది.