టీటీడీ గోశాలలో గత మూడు నెలల నుంచి వందకుపైగా ఆవులు మృతి చెందాయని, ఇది టీటీడీ వైఫల్యమేనని ఆరోపించిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కుపోతున్నారా? ఈ విషయంలో చేసిన రాజకీయంతో భూమన మరింత బుక్ అవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గత మూడు నెలలో వందకు పైగా ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. వైసీపీ హయాంలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని, ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులను పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నాచు పట్టిన నీళ్లను గోవులకు పట్టించారని, విజిలెన్స్ వాళ్లు తనిఖీలు చేసేందుకు అనుమతించలేదన్నారు.
ఆవు నెయ్యి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అన్న ప్రసాదంలో నాణ్యత లోపించిందని , స్వామి వారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో ౩కోట్ల విలువైన సరకులకు 25 కోట్లు చెల్లించారని ఈవో తెలిపారు. 2021 నుండి 2024 వరకు గో శాలలో జరిగిన అవకతవకలు పై విజిలెన్స్ రిపోర్ట్ ఉందన్నారు ఈవో. అంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నాయి. మరిన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
వంద ఆవుల మృత్యువాత అంటూ భూమన చేసిన ఆరోపణలతో వైసీపీ హయాంలో టీటీడీలో చోటు చేసుకున్న అవినీతిపై మరింతగా తీగ లాగే అవకాశం ఉంది. అదే జరిగితే భూమనతోపాటు కొంతమంది టీటీడీ అధికారులు బుక్ అయ్యే అవకాశం ఉంది.