శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా దేవదేవునికి పూజలు చేసుకోవాల్సిన రమణదీక్షితులు ఇప్పుడు కేసుల పాలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన తిరులమ గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆయనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.
రమణ దీక్షితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. సెక్షన్ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్విత్ 120 మేరకు కేసు నమోదు చేశారు. నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణదీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని రమణ దీక్షితులు అంటున్నారు. కానీ దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
2018లో చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర పూరితంగా ప్రెస్ మీట్లు పెట్టారు రమణదీక్షితులు. పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు అంటూ.. ఇతర రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపించారు. అప్పట్లో ఆయనకు రిటైర్మెంట్ ప్రకటించేసింది ప్రభుత్వం. అయితే ఆయన పై కేసులు పెట్టలేదు. కానీ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. వారి కుట్రలు ఫలించి టీడీపీ ఓడి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పిటిషన్లపై విచారణ జరగకుండా వైసీపీ నేతలు చేసుకున్నారు.