దేవదేవుని దర్శనం కోసం… అమెరికా నుంచి బయలుదేరినా… గోవిందుని నామస్మరణమే చేస్తారు. కానీ.. శ్రీవారి సేవలో ఉండేవారు మాత్రం..ఆ శ్రీవారిని తప్ప… ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన వారందరి నామస్మరణ చేస్తూంటారు. టీటీడీ అధికారులు. ఉద్యోగులు.. శ్రీవారి కన్నా… స్వరూపానందకే ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వరూపానందేంద్రకు… టీటీడీ అధికారులు నేరుగా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికేశారు. ఇప్పటి వరకూ ఏ పీఠాధిపతికి కానీ.. ముఖ్యమంత్రికి కానీ.. గవర్నర్కు కానీ…రాష్ట్రపతికి కానీ.. చివరికి ప్రధానమంత్రికి కూడా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికిన సందర్భం లేదు.
అంతే కాదు.. స్వరూపానందను స్వాగతం చెప్పిన పద్దతి కూడా.. శ్రీవారిని కించపరిచేలా ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసం లో జరిగే తిరుప్పావై ఉత్సవాల సందర్భంగా మూల విరాట్ కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా అలంకరించే పవిత్ర ఆకులతో తయారు చేసిన ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుంచి అలిపిరి వద్దకు తీసుకొచ్చి స్వరూపానందకు ఇచ్చారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధం. శ్రీ వారికి అలంకారం చేసిన పూలమాలలను బయటకు ఇవ్వకూడదు. వీటిని తీసుకొచ్చి.. స్వరూపానందకు వేశారు. ఇవన్నీ తీవ్ర విమర్శల పాలవుతూండగా.. కొత్తగా శ్రీవారి నిధులు కూడా.. శారదా పీఠానికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానంద నిర్ణయించారు. దీనికి నిధులు కేటాయించాలని… స్వరూపానంద ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం.. బాగా ఆదాయం ఉన్న ఆలయాలకు సాయం చేసే అవకాశాలు పరిశీలించాలని లేఖ రాశారు. ఇందులో తిరుమల కూడా ఉంది. మంజూరు చేయడం… మాత్రమే మిగిలిందని.. స్వరూపానందకు ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యత చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు.
ఒక భక్తుడు పంపిన లేఖ మరియు వీడియో
టీటీడీ అధికారుల అత్యుత్సాహాన్ని శ్రీవారు గమనిస్తున్నారు – ఆత్మపరిశీలన చేసుకోండి
– నవీన్ కుమార్ రెడ్డి pic.twitter.com/lXhitNlAII
— Telugu360 (@Telugu360) December 19, 2019