తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీ వెనుక ఉన్నది అవినీతి కంటే ఎక్కువగా భక్తుల విశ్వాసాలు దెబ్బకొట్టాలనే దారుణమైన కుట్ర ఉందన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డెయిరీ ఒక్క లీటర్ కూడా నెయ్యి సరఫరా చేయలేదు. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలెబాబా అనే కంపెనీ నుంచి నెయ్యి రూ. 350కి కొని వైష్ణవి డైరీ అనే తిరుపతి ప్లాంట్ కుతీసుకు వచ్చింది.. మళ్లీ ఎఆర్ డెయిరీ నుంచి సరఫరా చేస్తున్నట్లుగా చూపించారు. ఇంతా చేసి నెయ్యి ధరను రూ. నలభై తగ్గించారు. ఎందుకలా ?
ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలిపోయింది. దాన్ని నిరూపించడానికి అవసరమైన అన్ని సాక్ష్యాలు బయటకు వచ్యాయి. ఏమేమీ కల్తీ చేశారన్నది కొత్త సిట్ తేల్చే అవకాశం ఉంది. అసలు ఇలా కల్తీ చేస్తే వచ్చే లాభం భారీగా ఉండదు. మరి ఎందుకు చేశారు ?. ఎవరు చేయించారు ?. డబ్బుల కోసం కాదని ఇదంతా శ్రీవారి , హిందువుల మత విశ్వాసాలను దెబ్బకొట్టే అతి పెద్ద మాఫియా పని అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టులు ఇచ్చారని అందు కోసం రూల్స్ మార్చారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని .. తిరుమలకు వెళ్లలేదు. ఆయన వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం గురించి చెబితే వినాల్సిన ఖర్మ పట్టిందని పయ్యావుల అంటున్నారు. జగన్ రెడ్డి తీరు చూస్తే.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తే తాము చేసిన కుట్ర బయటపడుతుదంని కంగారు పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి అంతర్జాతీయ మత మాఫియాతో కలిసి ఇలాంటి కుట్రకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు ఆయన స్పందనతో వ్యక్తమవుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.