తిరుమల తిరుపతి దేవస్థానం … శ్రీవారిని ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగంగా.. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ కార్యనిర్వహణలో ఉండేలా ఆలయాలను నిర్మించాలనుకుంది. అది ధార్మికమైన కార్యక్రమం. నిజానికి ఈ ఆలయాల వల్ల శ్రీవారు భక్తుల దగ్గరకు వెళ్లినట్లు మాత్రమే కాదు.. విరాళాలు, ఆదాయం కూడా టీడీపీకి వస్తుంది. ఈ క్రమంలో.. అమరావతిలో కూడా ఓ ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ.. హిందూత్వ వాదానికి తామే పరిరక్షకులమని.. దేవుడ్ని కూడా తామే రక్షిస్తామని బయలుదేరి… రాజకీయ ప్రయోజనాల కోసం… ఆ దేవుడ్ని కూడా.. వివాదాలలోకి లాగడానికి ఏ మాత్రం సంకోచించచని… బీజేపీ నేతలు… టీటీడీ నిర్ణయాలను ఖండించారు. దేవుడి సొమ్మును దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ.. ఎవరో ఒకరు ఓట్ల కోసం కాషాయం పూసుకున్న నేత విమర్శలు చేస్తూనే ఉంటారు.
కానీ మహారాష్ట్రంలో ఏం జరుగుతోంది..? . మహారాష్ట్రలో ప్రఖ్యాత ఆలయం షిర్డి ఆలయానికి చెందిన షిర్డి సంస్థాన్ ట్రస్ట్ ఆదాయం నుంచి… రూ. 500 కోట్లను… మహారాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణంగా తీసేసుకుంది. ప్రభుత్వాలు తల్చుకుంటే.. ఇలాంటి ఆలయాల దగ్గర ఉన్న సొమ్మలను… తమ ఖాతాలో వేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. ఈ రూ. ఐదువందల కోట్లను… అభివృద్ధి పనులకు వెచ్చిస్తారట. ప్రవర నదిపై ఉన్న నీల్వాండే డ్యామ్ కాలువలు నిర్మిస్తారట. నిజానికి అభివృద్ధి పనులు ప్రభుత్వ నిధులతో వెచ్చించాలి. ఒక వేళ రుణంగా తీసుకుంటే.. దానికి వడ్డీ చెల్లించాలి. కానీ దేవుడి సొమ్మును అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్పనంగా తీసుకుంది. ఇక అసలు చెల్లిస్తారా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే.. ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వం చేతిలోనే ఆలయం పై పెత్తనం ఉంటుంది. కాబట్టి.. ప్రభుత్వం వడ్డీ కాదు.. అసలు కూడా ఇవ్వదు. సాయిబాబా అడగలేరు.
మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. దేవుడిపై అమితమైన భక్తిని ఓట్ల కోసం చూపించే.. సోకాల్డ్ బీజేపీ నేతలు… సాయిబాబా సొమ్మును ఎలా తీసుకుంటారని ఒక్కరూ ప్రశ్నించడం లేదు. భక్తులు దేవునికి కానుకగా ఇచ్చిన సొమ్ములను.. వడ్డీ లేని రుణంగా తీసుకోవడం ఏమిటన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది. దేవుడికి తృణమో..పణమో సమర్పించుకునేవారు భక్తులు. కానీ.. ఆ దేవుడి సొమ్మును మింగేవారు భోక్తలు. వారేమీ భక్తులు కాదు. భక్తుల రూపంలో భోక్తలు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు మరోసారి నిరూపించారు. పొరపాటున ఏపీ ప్రభుత్వం కానీ. టీడీపీ సొమ్మును.. ఓ రూ. వంద కోట్లయినా తీసుకుని ఉన్నట్లయితే.. ఇప్పటికే.. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లను కూడా పిలిపించి ధర్నాలు చేసి ఉండేవారేమో..?
.