రాజకీయాల కోసం శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేసిన ఆరోపణలకు… వివరణ ఇవ్వాలని… టీటీడీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని.. రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. విలువైన నగలు కనిపించడం లేదని కూడా చెబుతున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారి నగలు… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని.. ఆయన ఇంట్లో తవ్వితే బయటకు వస్తాయని ఆరోపణలు ప్రారంభించారు. దీనిపై టీటీడీ బోర్డు సీరియస్ అయింది. నిరాధారణ ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా… కావాలనే వీరు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. న్యాయపరమైన చర్యలు తీసుకోవలాని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు.
రమణ దీక్షితులు ఇరవై నాలుగేళ్ల పాటు.. శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలు అందించారు. ఆగమ సలహాదారునిగా వ్యవహరించారు. ఇరవై నాలుగేళ్ల పాటు… ఆలయం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. ఆయన తీరుపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్ది రోజుల క్రితం అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత రోజు నుంచే…. టీటీడీపై అనేక ఆరోపణలు ప్రారంభించారు. స్వయంగా తాను పర్యవేక్షిస్తున్న అంశాల్లోనూ… తప్పులు జరిగాయని… దానికి ప్రభుత్వానిదే బాధ్యతన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టి రాజకీయంగా వాడుకుందామన్న ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
రమణదీక్షితుల ఆరోపణలకు బీజేపీ, వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రమణదీక్షితులకు నేరుగా సపోర్ట్ చేశారు. ఆయన ఆరోపణలపై విచారణ చేయిస్తామన్నట్లుగా మాట్లాడారు. ఇటు వైసీపీ కూడా ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతేనే… చంద్రబాబు పట్టుకెళ్లారని చెప్పగలిగే నైపుణ్యం ఉన్న వైసీపీ నేతలు.. దీన్ని ఎందుకు వదులుకుంటారు. అందుకే… శ్రీవారి నగలన్నీ చంద్రబాబు కొట్టేశారని.. ఆయన ఇంట్లో తవ్వితే బయటపడతాయని విజయసాయిరెడ్డి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెప్పడం ప్రారంభించారు.
ఈ పరిణామాలు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఇద్దరికీ మొదటి దశగా నోటీసులు జారీ చేసింది. చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని లేకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేరొన్నారు. నిజానికి ఈ నోటీసుల్ని స్వయంగా అందించడానికి టీటీడీ ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ వారు తప్పించుకు తిరగడంతో… పోస్టు ద్వారా నోటీసులు పంపారు. టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొంత మందికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు.