సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఐటీ కారిడార్ మధ్యతరగతికి అందుబాటులో లేని ఓ విదేశీనగరంగా మారిపోయిన తరుణంలో అందుబాటులో ఉండే.. సమీపంలో ఉండే ప్రాంతంగా దక్షిణ ప్రాంతం నిలుస్తోంది. అందులోనూ తుక్కుగూడ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతోంది.
ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఉండే తుక్కుగూడ రియల్ ఎస్టేట్ పరంగా చాలా కాలంగా హాట్ ప్రాపర్టీనే. కానీ అది మరీ ఆకాశానికి చేరలేదు. మద్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కొనగలికే స్థాయిలోనే అక్కడ ధరలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండటంతో తుక్కుగూడ లో నివాస, వాణిజ్య సముదాయాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
రవాణా, కనెక్టవిటీ పరంగా దక్షిణ ప్రాంతానికి తిరుగులేదు. శ్రీశైలం హైవే, బెంగళూర్ నేషనల్ హైవే, దగ్గర్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకునే వీలుండటం బాగా కలసి వస్తోంది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేతో నగరంలోకి వెంటనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చిన్న బిల్డర్లు నిర్మించే అపార్టుమెంట్లు రూ.70 లక్షలకు కూడా లభిస్తున్నాయి. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలు.. విల్లాలు నిర్మాణం జరుగుతోంది. కోటిన్నర నుంచి ఇలాంటి ఇళ్లు లభిస్తున్నాయి.