లాయర్ల పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న తీరు క్రమంగా వెలుగులోకి వస్తోంది. తాజాగా తులసీబాబు కు రూ. 48 లక్షలను లాయర్ ఫీజుల పేరుతో చెల్లించారు. కానీ అలా చెల్లించేనాటికి కనీసం బార్ కౌన్సిల్ లో అతను లాయర్ కాదు. మరి ఎందుకు చెల్లించారు ?
ఈ తులసీబాబు అనే వ్యక్తిని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ గా నియమించుకున్నారు. కొన్ని కేసుల పేరు చెప్పి ఏకంగా అరకోటి చెల్లించేశారు. అందులో ఆయన వాదించిందేమీ లేదు. ఇలా ఎందుకు జరిగింది.. డబ్బులు ఎందుకు చెల్లించారన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. తులసీబాబు కస్టడీలో పోలీసులు ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా స్పందించలేదని చెబుతున్నారు.
ఈ వ్యవహారంలోనూ ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సలహాదారుగా తులసీబాబును నియమించింది సునీల్ కుమార్ కాబట్టి ఆ డబ్బులు ఇద్దరు కలిసి పంచుకుని ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసే పీవీ సునీల్ మరోసారి నిండుగా కూరుకుపోయే అవకాశం ఉంది.