తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు పేరు ఖరారు అయింది. ఆయనతో పాటు ఇరవై నాలుగు మంది సభ్యులను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సభ్యులుగా జ్యోతుల నెహ్రూ, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్, యాదాద్రికి రూపశిల్పిగా పని చేసిన ఆనంద్ సాయి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, తెలంగాణకు చెందిన నర్సిరెడ్డి వంటి వారు ఉన్నారు.
టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును ఖరారు చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన కుమారుడు డ్రగ్స్ కేసులో ఉన్నాడని సాక్షి పత్రిక ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. దానిపై టీవీ5 వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేస్తామని ప్రకటించింది. వారు విడుదల చేసిన డాక్యుమెంట్స్ కూడా ఫేక్ అని ఆరోపణలు వచ్చాయి. అవి తేలిపోవడంతో చైర్మన్ గా ప్రకటించారు.
జనసేన, బీజేపీ సిఫారసు చేసిన వారికీ కూడా పదవులు దక్కాయి తెలంగాణ నుంచి బొంగునూరి మహేందర్ రెడ్డి, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి జనసేన కోటాలో పదవులు పొందారు. తెలంగాణ టీడీపీ నుంచి నర్సిరెడ్డికి అవకాశం కల్పించారు. వివాదం కాని విధంగా పలువురు వివిధ రంగాల్లో ప్రముఖులకు అవకాశం కల్పించారు.