చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్‌లను మార్గాని భరత్, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు తిడితే కనీసం పావు గంటకు తక్కువ కాకుండా కవరేజీ ఇస్తాయి ఎన్టీవీ, టీవీ9. అదే జగన్ ను సొంత సోదరి తీవ్రంగా విమర్శిస్తే మాత్రం అసలు స్పేస్ ఇవ్వవు. కనబడలేదు.. వినబడలేదు అన్నట్లుగా ఉంటాయి. విజయసాయిరెడ్డి తనతో భేటీ విషయంపై.. షర్మిల తాజాగా స్పందించారు. ఆమె మాటలు సంచలనం సృష్టించారు. జగన్ కు లేని క్యారెక్టర్ గురించి షర్మిల వివరించారు. అయితే వాటిని ప్రసారం చేయడానికి ఈ రెండు చానళ్లకు ధైర్యం చాలలేదు.
విజయసాయిరెడ్డి చెప్పిన విజయాలతోనే జగన్ రెడ్డి ని షర్మిలపై విమర్శించారు. ఆయన ఎంత ఘోరమైన వ్యక్తో చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లను ఏ అనామకుడు తిట్టినా ప్రసారం చేసేలా ఈ చానళ్లు.. జగన్ ను సొంత సోదరి తిడితే ఎందుకు ప్రసారం చేయరు..?. షర్మిల ఏమైనా అన పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారా అంటే అదేమీ లేదు. జగన్ చెప్పిన మాటల్ని చెప్పి.. ఆయన ఎంత రివర్స్ లో ప్రవర్తిస్తారో.. తేల్చారు. ఇది షర్మిలకు అన్యాయం చేయడమే. ఎంత కాలం ఇలా అన్యాయమైపోయిన వాయిస్ల్ని తొక్కేసి ఈ రెండు చానళ్లు మీడియా విలువల్ని పాటిస్తాయి ?
ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తూంటే.. ఈ రెండు చానళ్లు పూర్తిగా జగన్ అండ్ కో అధీనంలోనే ఉన్నాయి. బినామీ పెట్టుబడులు పెట్టారా.. ఆ యాజమానులు ఇంకా జగన్ అభిమానులుగా ఉన్నారా అన్నది వారికే తెలియాలి. వారు ఎన్ని చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. వ్యక్తిత్వహననం, బురదచల్లుడు ఆపేశారు కాబట్టి మారారని అనుకోలేం.. రేపు అవకాశం వస్తే దేనికైనా సిద్దపడతారని…. వారే బయట పెట్టుకుంటున్నారు.