తెలుగు మీడియా చానళ్లలో టీవీ9 మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. ఎలక్షన్ కౌంటింగ్ అనంతర పరిణామాల్లో టీవీ9 ఎక్కువ మందిని తన కవరేజీతో ఆకర్షించగలిగింది. అడ్డగోలు చర్చలు పెట్టకుండా.. కేవలం న్యూస్ ప్రసారానికి పరిమితమవడంతో.. మళ్లీ ప్రేక్షకులు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెండో స్థానంలో ఎన్టీవీ ఉంది. అయితే ఎలక్షన్ కవరేజీలో మాత్రం వెనుకడిపోయింది. టీవీ9కి..ఎన్టీవీకి మధ్య వ్యూయర్ షిప్లో చాలా తేడా ఉంది. మూడో స్థానంలో టీవీ 5, తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత వీ6 చానల్స్ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నాయి.
వైసీపీ ఓటమి ప్రభావం సాక్షి చానల్ పై ఎక్కవగా పడింది. ఆ చానల్ మొత్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. టీ న్యూస్ కంటే కాస్త ఎక్కువ వ్యూయర్ షిప్ సాధించింది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ఫ్యాన్స్ కూడా ఆ చానల్ ను నమ్మలేకపోతున్నారు. కనీసం ఎలక్షన్ రిజల్ట్ కూడా అందులో చూసేందుకు సిద్ధపడలేకపోయారు. వైసీపీ.. జగన్ ఫ్యాన్స్ అంతా సాక్షి 9గా ముద్రపడిన టీవీ9 వైపు చూడటంతో ఆ చానల్ కు బాగా ప్లస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక డిస్ట్రిబ్యూషన్ పెద్దగా ఉండని మహాటీవీ కూడా మెరుగైన ర్యాంకులు సాధిస్తోంది.
Also Read : మీడియా వాచ్ : ఇప్పుడు టీవీ9కి బాబు బంగారం
సాక్షి కన్నా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రేటింగ్స్ తెచ్చుకుంటోంది.దాదాపుగా రెట్టింపు తెచ్చుకుంటోంది. టీవీ9 లో ఇటీవలి కాలంలో స్టాండర్డ్స్ మార్చుకున్నారు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. జగన్ కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రమోషన్ వార్తలు ప్రసారం చేశారు. ఇప్పుడు అసలు డిబేట్లు కూడా పెట్టడం లేదు.