టీవీ 9 .. ఏపీ సర్కార్‌ను… ఆహో.. ఓహో అని పొగడటంలో.. ఏ మాత్రం మొహమాటాలు పెట్టుకోవడం లేదు. మీడియాగా ప్రజల వాయిస్‌ను వినిపించాల్సిన టీవీ9 కేవలం.. జగన్ వాయిస్‌ను..వినిపిస్తూ.. ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ..సోషల్ మీడియాలో.. వైసీపీ కార్యకర్తలు .. తన నేతను కీర్తించుకుంటూ చేసే పొగడ్తల తహా హెడ్‌లైన్స్… క్యాప్షన్స్ పెట్టుకుంటూ.. స్వామి భక్తిని విపరీతంగా ప్రదర్శిస్తోంది. దీంతో.. టీవీ చానళ్లలో సాక్షి -2గా టీవీ9 మారిపోయిందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో పడిపోతోంది.
టీవీ9ను.. గతంలో అన్ని పార్టీల వారు ద్వేషించేవారు. వైసీపీకి అనుకూలమని టీడీపీ.. టీడీపీకి అనుకూలమని.. వైసీపీ.. ఇలా రకరకాలుగా.. అన్ని పార్టీల వారు విమర్శించేవారు. దీనికి కారణం.. ఏ పార్టీని వదిలి పెట్టకుండా.. తన టీఆర్పీనే లక్ష్యంగా చూసుకుని.. టీవీ9 వార్తా ప్రసారాలు..చేసేది. కానీ యాజమాన్యం మారిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత… టీఆర్పీలు వస్తే.. చానల్ మాత్రమే నెంబర్ వన్ గా ఉంటుంది.. కానీ ప్రభుత్వాలను పొగడటం వల్ల అంతకు మించి ప్రయోజనం ఉంటుందని.. ఆశించినట్లుగా ఉన్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు.
టీవీ9 కొత్త యజమానులు.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రివర్స్ టెండర్లలో ప్రధాన లబ్దిదారులుగా ఉన్నారు. ప్రతి ప్రధాన ప్రాజెక్టుకు.. జరుగుతున్న రివర్స్ టెండర్లలో.. ఒకే సంస్థకు పనులు దక్కుతున్నాయి. ఆ సంస్థ వద్దనుకున్న .. చిన్నా చితకా పనులు మాత్రమే ఇతరులకు దక్కుతున్నాయి. ఈ క్రమంలో.. టీవీ9 ఇలా .. ప్రభుత్వాన్ని భుజాలపై మోయడంలో.. ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం.. రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ.. మీడియా విలువల సంగతేమిటనేదే ప్రశ్న. మీడియా విలువలకు.. ఓ విలువ కట్టి… దానికి తగ్గ లబ్దిని యాజమాన్యం చూసుకుంటోంది. అందుకే.. టీవీ9ని కూడా.. మరో సాక్షిగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చేసిందంటున్నారు.. వీక్షకులు.!