మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. అసెంబ్లీలో పెట్టే సందర్భం.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రైతుల ఆందోళన.. ఉద్రిక్తంగా సాగింది. కొన్ని వేల మంది రైతులు.. నిరసన చేపట్టారు. అసెంబ్లీ చుట్టూ గుమికూడారు. ఓ రకంగా.. ఇది.. సంచలనమే. సామాన్యుల వాయిస్ వినిపించాల్సిన మీడియాకు.. ఇది సంచలనాత్మకమే. కానీ.. కొన్ని మీడియా చానళ్లకు మాత్రం రైతుల ఆందోళనలు.. వారి కన్నీళ్లు అసలు కనిపించలేదు. టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీల్లో అసలు రైతుల నిరసనలు చోటే లేకుండా పోయింది. కేబినెట్ నిర్ణయాల్ని.. అసెంబ్లీ సమావేశాల్ని మారధాన్గా ఇచ్చిన ఈ మూడు చానెళ్లు.. రైతులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నా.. లైట్ తీసుకున్నారు.
యాధృచ్చికంగా… అటు టీవీ9లోనూ.. ఇటు ఎన్టీవీలోనూ… హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు భాగస్వామ్యం ఉంది. ఆ సంస్థ కోసమే… అమరావతిని సర్వనాశనం చేసి.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెంచుతున్నారన్న ఆరోపణలు.. ఇతర పార్టీల నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆ చానళ్లు… రైతుల పక్షాన నిలవడానికి వారి ఆందోళనను చూపించడానికి నిరాకరించాయి. సాక్షి టీవీ పూర్తిగా.. వైసీపీ యాజమాన్యంలో ఉంటుంది కాబట్టి.. వారి నిర్ణయాలకు ఎవరు ఎదురు తిరిగినా వారికి ఆ మీడియాలో చోటు దక్కదు కాబట్టి.. అందరూ లైట్ తీసుకుంటారు.
కానీ…టీవీ9, ఎన్టీవీ కూడా..వారి కేటగిరిలోనే చేరిపోయిన విషయం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆందోళనలు చేసే రైతులను.. మీడియా అసలు పట్టించుకోకపోవడం.. తెలుగు మీడియాలో వచ్చిన ఓ కొత్త ధోరణిగా.. పేర్కొనవచ్చు. సామాన్యుల వాయిస్‌గా మారాల్సిన మీడియా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా పూర్తిగా మారిపోయిన వ్యవహారం ఇప్పుడు .. ఏపీలో చర్చనీయాంశం అవుతోంది.