జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన ఇచ్చే డబ్బులకు ఆశపడి .. కేసులు పెడతారేమోనని భయపడి చిటికెలు వేసి ఉండవచ్చు కానీ ఓడిపోయిన తరవాత ప్రధాన మీడియా అని చెప్పుకునే టీవీ9, ఎన్టీవీ జగన్‌కు ఎందుకు ఊడిగం చేస్తున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. మామూలుగా మీడియా సంస్థల్లో కొన్ని విలువలు పాటించేవి ఉంటాయి. తమకు ఇష్టమైన నేత అయితే ఎక్కువ కవరేజీ ఇవ్వడం. ఇతర పార్టీల్ని కుట్ర పూరింగా విమర్శించకుండా కొంత ప్రజాస్వామ్య విలువలు పాటించడం చేస్తూంటాయి. ఈ కనీస మీడియా లక్షణాలను కూడా ఆ రెండు చానళ్లు పాటించడం లేదు.
జగన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలో టీవీ9, ఎన్టీవీ చూస్తున్న వారికి ఒకే వెర్షన్ వినిపిస్తోంది. షర్మిల కన్నీరు పెట్టుకున్నా ఈ చానళ్లకు కనీస పట్టింపు లేదు. రెండు రాష్ట్రాల్లో వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి ఏమైనా రాజకీయ కుట్రలు చేస్తే .. వాళ్లు విపక్షంలో ఉన్నప్పటికి వేషాలు వేస్తే తొక్కిపెట్టి తాట తీస్తారు కాబట్టి వాళ్లను పొగుడుతున్నట్లుగా నటిస్తున్నారు. కానీ జగన్ పై అభిమానం మాత్రం లోపలఅలాగే ఉంచుకుని అవసరమైనప్పుడల్లా బయట ప్రదర్శిస్తున్నారు. ఎందుకిలా అనేది హాట్ల టాపిక్ గా మారుతోంది.
ఇన్ సైడర్స్ సమాచారం ప్రకారం జగన్ రెడ్డి గత ఐదేళ్లలో దోచిన దాంతో … ఆయా చానళ్లలో బినామీ వాటాలు కొనుగోలు చేశారు. టీవీ9 యాజమాన్యంలో అనధికారికంగా జగన్ రెడ్డి కూడా ఓ భాగస్వామి. ఆయన బినామీ ఒకరు డైరక్టర్ గా ఉన్నారు. ఎన్టీవీ చైర్మన్ కు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మేళ్లు చేశారని ఎన్టీవీలోనూ బినామీ పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. అందుకే ఆ రెండు చానళ్లు సాక్షి మాదిరిగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నాయని భావిస్తున్నారు . జగన్ రెడ్డి ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ… ఓ ఇష్యూ మీద కనీసం అయినా రెండో వాదన వినిపించాలి… అలా చేతకాకపోతే చానళ్లు క్లోజ్ చేసుకుని రియాలిటీ షోల చానల్‌గా మార్చేసుకుంటే బెటర్ అన్న కామెంట్లు వినాల్సి ఉంటుంది.