తెలుగు మీడియా చానల్ టీవీ9 టీఆర్పీల్లో మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 వెనుకబడిపోయింది. దాదాపు రెండేళ్లుగా ఆ చానల్ రెండో స్థానంలో ఉంది. మరో తెలుగు మీడియా చానల్ ఎన్టీవీ మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఈ వారం వచ్చిన బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ కన్నా టీవీ9 ఒక్క పాయింట్ అధికంగా సాధించి మళ్లీ నెంబర్ ప్లేస్‌లో నిలింది.
రెండేళ్ల కిందట కోల్పోయిన తమ నెంబర్ వన్ స్థానం మళ్లీ వచ్చిందన్న ఆనందం టీవీ9 టీమ్‌లో కనిపించింది. కనీసం రెండు గంటల పాటు సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసుకున్నారు. అసలు సాధ్యమయిందో అంరదూ కథలు కథలుగా ప్రేక్షకులకు చెప్పారు. అంతా బాగానే ఉంది ఒకప్పుడు తిరిగులేని పొజిషన్ ఉన్న చానల్ దిగజారిపోయింది కూడా తమ చేతుల్లోనే అని మాత్రం గుర్తు చేసుకోలేకపోయారు.
మొత్తం క్రెడిట్ సహజంగానే రజనీకాంత్ కు కట్టబెట్టారు చాలా మంది. రవి ప్రకాష్ నుంచి ఆయన చేతుల్లోకి చానల్ వెళ్లిన తర్వాత దిగజారిపోయింది.. అల్టిమేట్ స్థానాన్ని కోల్పోయిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ లు ప్రతీవారం మారిపోతాయి. ఒక్క వారానికే టీవీ9 ఇంత సంబర పడిపోతే వచ్చే వారం రేటింగ్‌లో మళ్లీ టీవీ9 స్థానం పడిపోతే ఎగతాళి చేసే వారికి కొదవ ఉండదు.
ముఖ్యంగా ఎన్టీవీ మళ్లీ ఫస్ట్ వస్తే వాళ్లు ర్యాగింగ్ చేయకుండా ఉంటారా? గతంలో వరుసగా కొన్నాళ్ల పాటు తాము ఫస్ట్ ఉన్నామని ఎన్టీవీ గట్టిగానే ప్రచారం చేసుకుంది.