మహాసేన రాజేష్‌పై టీవీ9 రజనీకాంత్ కేసులు పెట్టారు. ఎందుకంటే ఆయన తన వీడియోలతో కించపరిచారట. ఈ ఫిర్యాదు నిజమే అయితే… రజనీకాంత్‌పై ఎన్ని వేల కేసులు పెట్టొచ్చో లెక్కేయడం చాలా కష్టం. ఎందుంటే టీవీ9 అనే టీవీ చానల్ చేసే పని అదే. ప్రతీ రోజూ …. తమ యజమానుల మెప్పు కోసం వారి రాజకీయ ప్రత్యర్థుల్ని కించ పర్చడం ఇష్చం వచ్చినట్లుగా రాతలు రాయడం.. ప్రసారాలు చేయడం. ఇాలాంటి కేసులు పెడితే.. రజనీతాంత్ జీవితాంతం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలన్న సెటైర్లు సహజంగానే వస్తున్నాయి.
సజ్జల రామకృష్ణారెడ్డిని సూపర్ ఎడిటర్ గా పెట్టుకుని ఆయన చేయమన్న తప్పుడు ప్రచారాలన్నీ నిస్సిగ్గుగా చేస్తతూ… సమాజంలో కుల చిచ్చు పెడతామని అడ్డగోలుగా వీడియోలు చేసుకునే స్థితికి చేరిన టీవీ9 తమను అవమానించారని ఇతరులపై కేసులు పెట్టాలనుకోవడం… తాము బురదలో ఉండి ఇతరులపై రాళ్లేయడమే. అది ఇతరులకు అంటుకుంటుందో లేదో కానీ.. రివర్స్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రజనీకాంత్ … మహాసేన రాజేష్ పై కేసు పెట్టిన తర్వాత వ్యక్తం చేసిన స్పందన అదే.
రజనీకాంత్ పై ఇప్పటికే తోటి జర్నలిస్టులు చాలా మంది పరోక్షంగా ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు.. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం… ఇంకా హైదరాబాద్ లో చెప్పుకోలేని చీకటి దందాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటివన్నీ ఆయన దగ్గర ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్లే చెబుతున్నారు. ఇప్పుడటంటే.. అధికార పార్టీల కొమ్ము కాచి అందర్నీ కించపరుస్తూ… బండి లాగిస్తున్నారు కానీ.. సరిపోతుంది..కానీ కేసులు కూడా పెడితే…. దానికి రియాక్షన్ గా కేసులే వస్తాయని చరిత్ర నిరూపిస్తోంది. అలా జరిగినప్పుడు జర్నలిస్టు సమాజం నుంచి కనీస స్పందన కూడా రాదు. ఎందుకో రజనీకాంత్ కు కూడా బాగా తెలిసి ఉండవచ్చు.