జర్నలిస్టు రజనీకాంత్… టీవీ9 రజనీకాంత్… ఆటోస్పై రజనీకాంత్ … ఇలా ఎలా చెప్పుకున్నా ఒకరే.. ఆయన ఓ ట్వీట్ పెట్టారు. దాని సారాంశం తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని .. మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని లీగల్‌గా చర్యలు తీసుకుంటానని దాని సారాంశం. ఆ ట్వీట్ చూసి అందరూ పళ్లన్నీ బయటపెట్టి అచ్చంగా రజనీకాంత్ నవ్వినట్లే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ ట్వీట్‌ను ఆయనకే అన్వయిస్తే… రోజుకో పది సార్లు లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మరి.
ఎప్పుడైనా టీవీ9 వార్తల్లో నిజాలున్నాయా ?
టీవీ9 నుంచి రవిప్రకాష్ నుంచి గెంటేసిన తర్వాత ఆ సీటును రజనీకాంత్ ఆక్రమించుకున్నారు. అప్పట్నుంచి టీవీ9 అబద్దాల ఫ్యాక్టరీగా మారిపోయింది. అలా ఇలా కాదు. ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఎన్ని వార్తలు ప్రసారం చేసారో లెక్కేలేదు. ఆ బాధితుల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఉన్నారు. మచ్చుకు కొన్ని చెప్పుకున్నా.. అత్యంత ఘోరమైన నీచానికి పాల్పడ్డారు.
రేవంత్ రెడ్డి, ఈటల క్యారెక్టర్ల పై దాడి చేసింది ఎవరు ?
2019 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో రేవంత్ ను బయటకు రాకుండా మూడు రోజులు ఇంట్లోనే ఉంచారు. ఆ మూడు రోజులు టీవీ9లో ప్రసారం చేసిన వివరాలేమిటి ?. వాటికి సంబంధించి కనీస ఆధారాలను బయట పెట్టగలరా ?. తప్పుడు ప త్రాలను క్రియేట్ చేసి మరీ తప్పుడు ప్రచారాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటలను గెంటేయాలనుకున్నప్పుడు ఆ కుట్రలో తప్పుడు ప్రచారాలు చేసి భాగమయింది రజనీకాంత్ కాదా ?. ఇవి మచ్చుకు రెండే.. రజనీకాంత్ నాయకత్వంలో టీవీ9 చరిత్ర తిరగేస్తే… మీడియా ముసుగులో చేసిన ఘోరాలతో ఎవరిలోనైనా ఆవేశం పెరిగిపోతుంది.
జగన్ రెడ్డి కోసం టీడీపీ పై చేసింది తప్పుడు ప్రచారాలు కాదా ?
ఏపీలో జగన్ రెడ్డి కోసం టీడీపీపై లెక్కలేనన్ని తప్పుడు ప్రచారాలు చేసింది నిజం కాదు. చంద్రబాబు, లోకేష్ సహా ఎంత మంది క్యారెక్టర్లపై నిందలేశారు. పెద్ద పెద్ద సభలు జరిగినా కనీస కవరేజీ ఇవ్వని వారు.. వ్యతిరేకంగా..క్యారెక్టర్ పై నిందలేయడానికి మాత్రం బ్రేకింగులు వేసేవాళ్లు.
ఇప్పుడు రజనీకాంత్ గురించి వాట్సాప్‌లలో జరుగుతున్నప్రచారం అంతా పచ్చి నిజాలు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లే వాటిని బయటకు పంపారు. ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తాయి. ఎంత గింజుకున్నా ప్రయోజనం ఉండదు. కర్మ ఫలం అనుభవించాల్సిందే.