టీవ 9 రేటింగ్‌లు అంతకంతకూ దిగజారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగులో ఓ వైపు ఎన్టీవీ తానే నెంబర్ వన్ అని గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. రూ. కోట్ల బడ్జెట్ కేటాయించి పోస్టర్లు.. డిజిటల్.. బస్టాండ్లలో ప్రకటనల ద్వారా చెప్పుకుంటోంది. వారం వారం గడిచిపోతోంది కానీ టీవీ9 మెరుగుపడటం లేదు. దీంతో దీంతో ఆ చానల్ యాజమాన్యం రూటు మార్చింది. తామే నెంబర్ వన్ అని వినూత్నంగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా సాక్షిలో ప్రకటనలు ఇచ్చేసింది.
సాక్షిలో రూ. లక్షలు పెట్టి ప్రకటనలు ఇస్తే.. స్వకార్యం.. స్వామి కార్యం రెండూ జరుగుతాయనుకున్నారేమో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. అన్ని చానళ్ల కన్నా తామే నెంబర్ వన్ అని చెప్పదల్చుకున్నారు. అయితే ఏ రాష్ట్రంలో ఏ స్థానంలో ఉన్నారో మాత్రం చెప్పలేదు. రీజినల్ లాంగ్వేజ్ చానళ్లతో టీవీ9 రంగంలో ఉంది. హిందీలో పెట్టిన భారత్ వర్ష్ చానల్ ఫ్లాప్ అయింది. ఈ పరిస్థితుల్లో టీవీ రేటింగ్స్‌లో దేశంలో నెంబర్ వన్ ఎలా అవుతుంతో ఆ గ్రూపే చెప్పాల్సి ఉంది. తెలుగులో టీవీ9 రేటింగ్ దారుణంగా పతనం అయింది. ఎన్టీవీతో సగం కూడా లేదు.
ఇతర రీజనల్ లాంగ్వేజ్‌లలో ఏ స్థాయిలో ఉందోటీవీ9 గ్రూప్ వివరంగా ప్రకటించి ఉండే.. ఆ చానల్ ఏ రేంజ్లో ఉందోఅంచనా వేయడానికి అవకాశం ఉండేది. మ్యానిప్యులేట్ చేయడంలో టీవీ9ది అందే వేసిన చేయి.. దానికి తగ్గట్లుగానే తామే నెంబర్ అవిని తెలుగు ప్రజల్ని నమ్మించడానికి నేషనల్ వైడ్ రైటింగ్స్‌తో … సాక్షి మీడియా ద్వారా జిమ్మిక్కులు ప్రారంభించింది. ప్రజలు నమ్ముతారో లేదో మరి !