కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లిపోయిన తర్వాత టీవీ9 రాజకీయ పావుగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇమేజ్ను డ్యామేజ్‌ను చేసుకునేలా.. రాజకీయ పెద్దల ప్రాపకం కోసం.. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించ పరిచేందుకు కూడా వెనుకాడని దారుణమైన జర్నలిజానికి టీవీ9 ఒడిగడుతోంది. దీనికి తాజాగా.. మరో ఉదాహరణ వెలుగు చూసింది. జనసేన పార్టీపై… దుష్ప్రచారానికి ప్రయత్నించి తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. పవన్ కల్యాణ్.. తన పుట్టిన రోజున… శుభాకాంక్షలు చెప్పిన వారికి… కృతజ్ఞతలు చెప్పడాన్ని కూడా తప్పు పట్టి… ఎవరి ప్రాపకం కోసం పని చేస్తున్నారో… క్లారిటీ ఇచ్చేసినట్లయింది.
సినిమాల్లో వేషాలు లేని హీరోయిన్ మాధవీలత.. వివాదాస్పద ప్రకటనల ద్వారా మీడియాలో అటెన్షన్ కోసం ఇటీవలి కాలంలో ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో కూడా చేరి.. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి.. పట్టుమని వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయిన ఈమె… పబ్లిసిటీ పొందడానికి దగ్గరదారిగా… వివాదాస్పద ప్రకటనలు ఎంచుకున్నారు. మాధవీలతపై… కొద్ది రోజుల కిందట.. ఇలా విద్వేష పోస్టులు పెట్టినందుకు కేసు కూడా నమోదయింది. డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌కు అంటించే ప్రయత్నం చేస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. అలాగే.. పవన్ కల్యాణ్.. ఉత్తరాది నేతలకు … పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పడాన్ని పెడర్థాలు తీస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దానిపై టీవీ బ్రేకింగ్‌లు వేసి మరీ హడావుడి చేసింది. ద్వేష భావాలు.. నాటడానికి ప్రయత్నించింది.
దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంతృప్తికి గురయ్యారు. టీవీ9 తీరును ప్రశ్నిస్తూ.. ప్రకటన విడుదల చేశారు. మీడియా సంస్థ బాధ్యతగా వ్యవహరింలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి గతంలో రవి ప్రకాష్ .. టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు.. పవన్ కల్యాణ్‌కు పెద్దగా ప్రాధాన్యత లభించేదికాదు. యాజమాన్యం మారిన తర్వాత పాజిటివ్‌గానే పవన్ కల్యాణ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ హఠాత్తుగా ఆయనను నెగెటివ్ యాంగిల్లో ప్రజెంట్ చేయాలని టీవీ9 ప్లాన్ చేసింది. దీని వెనుక.. రాజకీయ వ్యూహం ఉందని… జనసేన గట్టిగా నమ్ముతోంది. తమపై కుట్రలు చేస్తున్నారని… నాదెండ్ల మనోహర్ రెండు రోజుల క్రితమే.. ఆవేదన వ్యక్తం చేయడం.. ఈ సందర్భంగా గమనార్హం..!