రవితేజ మొదటిసారి జనాలకి బాగానే ‘కిక్’ ఇచ్చాడు కానీ రెండో సారి మాత్రం జనాలే ఆయన సినిమాకి కిక్ ఇచ్చినట్లు కనబడుతోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కిక్-2 ప్రేక్షకులను అక్కట్టుకోవడంలో విఫలమయింది. దానికి కారణం ఆయన మొదట ఇచ్చిన కిక్కేనని చెప్పకతప్పదు. ఆయన అదే కిక్కు కంటిన్యూ చేస్తారని జనాలు ఆశపడితే తప్పేమీ కాదు. కానీ వాళ్ళకి కావలసినంత కిక్ లేకపోవడంతో కిక్క్ తమకే కాస్త ఎక్కువయిందేమోననే అనుమానంతో ఆ సినిమాను మళ్ళీ చూసి దానిలో సెకండ్ హాఫ్ లో ఓ 20 నిమిషాల రీలు కత్తిరించి పక్కన పడేశారు. ఇప్పుడు స్క్రీన్ ప్లే టైట్ చేశాము కనుక ప్రేక్షకులకి కూడా కావలసినంత కిక్ ఎక్కుతుంది అని దర్శకుడు సురేందర్ రెడ్డి. అయినా కిక్క్ సరిపోకపోవడంతో ఏదో అలా సాగిపోతోంది అంతే. ‘ఈ కిక్క్ ఇవ్వని సినిమా కోసం అనవసరంగా బడ్జెట్ పెంచేశాడు’ సురేందర్ అంటూ దీనిని నిర్మించిన కళ్యాణ్ రామ్ వాపోతున్నట్లు సినీ పరిశ్రమలో టాక్. దానితో ఇద్దరు ఎడాపెడ మొహాలు వేసుకొని తిరుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అది గిట్టనివాళ్ళు చెప్పుకొనే టాక్ అంతే! అని సురేందర్ అంటున్నాడు. సురేందర్ రెడ్డి తీసిన రేసుగుర్రం విదేశాలలో దూసుకుపోయింది కానీ దీనికి ఎంతగా కిక్ కొట్టినా ఇంకా స్టార్ట్ అవ్వడం లేదని గిట్టనివాళ్ళ టాక్!