అస్సాం రాష్ట్రంలోని గౌహతీలో నిత్యం రద్దీగా ఉండే ఫాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రేలుళ్ళలో ప్రాణ నష్టం జరుగలేదు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఫాన్సీ బజారులో ఒక మిఠాయి దుకాణం దగ్గరలో ఉన్న ఒక చెత్త కుండీలో బాంబులు అమర్చారు. కొన్ని సెకండ్ల వ్యవధిలో రెండు బాంబులు ఒకదాని తరువాత మరొకటి పేలాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ప్రనానష్టం జరగలేదు. బాంబు ప్రేలుళ్ళతో ఉలిక్కిపడిన జనం ఏమవుతోందో తెలియక భయంతో పరుగులు తీసారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులని స్థానిక మేహేద్ర మోహన్ చౌదరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాఈ సమాచారం అందుకొన్న వెంటనే పోలీసులు, అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. బాంబు స్క్వాడ్ బృందాలు పరిసరాలన్నీ గాలించారు. కానీ మరెక్కడా బాంబులు దొరకలేదు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించారు. అది ఉల్ఫా ఉగ్రవాదుల పనే అయుండవచ్చునని గౌహతీ పోలీస్ కమీషనర్ ముకేష్ అగర్వాల్ అనుమానం వ్యక్తం చేసారు. ఇంతవరకు ఎవరూ ఈ ప్రేలుళ్ళకు తామే భాద్యులమని ప్రకటించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.