బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తల్లయ్యింది. సరోగసీ ద్వారా ఆమెకు కవల పిల్లలు పుట్టారు. వీరిద్దరికీ షయార్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అని పేర్లు పెట్టుకున్నారు. వెబర్ అనేది సన్నీ భర్త పేరు. అలా భర్త పేరు కలిసేలా నామకరణం చేసిందన్నమాట. ఇది వరకే వీళ్లకో ఆడపిల్ల ఉంది. సన్నీ తన ముగ్గురు పిల్లలతో తీయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్య సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి సెలబ్రెటీలు ఉత్సాహం చూపిస్తున్నారు. అమ్మదనం అనుభవించొచ్చు, దాంతో పాటు.. శారీరక శ్రమా తప్పుతుంది. సన్నీ వల్ల ఈ సరోగసీ విధానం మరోసారి చర్చల్లోకి వచ్చే ఆస్కారం ఉంది. తెలుగులో ఇటీవల `గరుడవేగ`లో ఓ ఐటెమ్ పాటలో కనిపించింది సన్నీ. ఆ తరవాత మళ్లీ ఆమె జాడలేదు. బాలీవుడ్లో మాత్రం విరివిగా సినిమాలు చేస్తోంది.