ట్విట్టర్ ఖాతా ఉంది.. భావప్రకటనా స్వేచ్చ ఉంది.. అంతకు మించి ఏం మాట్లాడినా చెల్లుబాటయ్యేలా బీజేపీ భక్తుల మద్దతు ఉందని.. చెలరేగిపోయిన కంగనా రనౌత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను ట్విట్టర్ సంస్థ శాశ్వతంగా తొలగించింది. కంగనా రనౌత్ చాలా రోజులుగా.. బీజేపీకి మద్దతుగా ట్వీట్లు చేస్తున్ారు. అయితే బీజేపీకి మద్దతు ఇవ్వడం అంటే.. ఇతర వర్గాల్ని కించ పర్చడం… తిట్టడం.. విద్వేషాన్ని పెంచడం అనుకోవడంతోనే సమస్య వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వారని దేశద్రోహులనడం దగ్గర్నుంచి ఆమె ట్వీట్లు.. వర్గాల మద్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి.
ఆమెపై మహారాష్ట్రలో ఈ అంశంపై కేసులు కూడా నమోదయ్యాయి. మూడు రోజులుగా ఆమె మరీ విద్వేష ట్వీట్లు చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికలపైనా .. ఫలితాలపైనా కామెంట్లు చేసింది. చివరికి ఆక్సిజన్ సిలిండర్ల కొరతను ప్రశ్నిస్తున్న వారినీ తిట్టింది. విపరీతంగా ఆక్సిజన్ వాడేస్తున్నారని.. ఆరోపించింది. అందరికీ సాయం చేస్తూ పేరు తెచ్చుకున్న సోనూ సూద్ పెద్ద ఫ్రాడ్ అంటూ పెట్టిన ఓ పోస్టుకు సైతం కంగనా లైక్ కొట్టింది. ఆమె ట్వీట్లపై రాను రాను ఫిర్యాదులు పెరిగిపోవడంతో.. చివరికి ట్విట్టర్ కూడా.. పరిిశఈలించక తప్పలేదు. సహించలేక… ట్విట్టర్ సంస్థనే అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
తనకు పెద్ద సపోర్ట్ ఉందని.. రెచ్చిపోయిన కంగన ట్విట్టర్ అకౌంట్‌ను ఆ సపోర్ట్ కాపాడలేకపోయింది. తమకు వ్యతిరేకంగా వచ్చే ట్వీట్లను తీసేయించడంలో చురుకుగా ఉండే బీజేపీ.. తమకు మద్దతిస్తున్న కంగనా ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి..!