గతేడాది ‘సామజవరగమన’తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజు. చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయాన్ని అందుకొంది. ఈ హిట్ తో రామ్ అబ్బరాజుకి అవకాశాలు వరుస కట్టాయి. ఆయన ఇప్పుడు శర్వానంద్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాలి. అందుకోసం సాక్షి వైద్య, సంయుక్త మీనన్లను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. వీరిద్దరితో శర్వా నటించడం ఇదే తొలిసారి. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో కొత్తరకమైన కథ అని తెలుస్తోంది. శర్వా ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘బాబ్’ అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అది పూర్తయిన వెంటనే రామ్ సుబ్బరాజు కథని పట్టాలెక్కిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించబోతోంది.