ఫాంహౌస్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్ల విషయంలో .. రెండు వేర్వేరు బెంచ్‌లు ఇచ్చిన ఆదేశాలు గందరగోళంగా మారాయి. మొదట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం .. ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారి రిమాండ్‌కు అనుమతిస్తున్నట్లుగా ప్రకటించింది. ముగ్గురు నిందితులను 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కాసేపటికే మరో బెంచ్.. ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై భిన్నమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయవద్దని ఆదేశించింది. ఫాం హౌస్ కేసులో ప్రతివాదులుగా ఉన్న 8మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసులు 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారంటూ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్రంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ కోరింది. వారి వాదనలతో బెంచ్ ఏకీభవించింది.
ఈ కేసు విషయంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన ఆదేశాలివ్వడంతో ఇప్పుడు పోలీసులు ఏ తీర్పు అమలు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. రిమాండ్‌కు అనుమతించిన తర్వాతనే… కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ మరో బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో చివరి సారిగా హైకోర్టు ఇచ్చిన తీర్పే్ అమలవుతుందని అంటున్నారు. మొత్తంగా ఈ కేసు విషయంలో న్యాయమూర్తులు ఇచ్చిన భిన్నమైన తీర్పులు కూడా మరింత గందరగోళానికి కారణం అవుతున్నాయి.