ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు చేయరు. మళ్లీ ధిక్కార పిటిషన్లు వేసుకుని బాధితులు పోరాడితే చివరికి కోర్టు కూడా.. తమ తీర్పులంటే అసలు లెక్క లేకుండా పోయిందా అని ఆగ్రహించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి శిక్షలు కూడా వేస్తోంది. తాజాగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్‌లకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఐఏఎస్ అధికారులు జె. శ్యామలరావు, పోలా భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్‌లకు రూ. వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు తేల్చింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇలా అధికారులకు శిక్షలు విధించడం ఇటీవల తగ్గింది. మళ్లీ ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. కనీసం పదిహేను మంది సీనియర్ ఐఏఎస్ లకు ఇప్పటి వరకూ జరిమానా, జైలు శిక్షలు పడ్డాయి. కొంత మంది సర్వీసు రికార్డుల్లోకి కూడా ఈ ధిక్కారం ఎక్కింది. అయినా వారు కోర్టు తీర్పులు అమలు చేయడం లేదు. సహజంగా ఈ తీర్పులన్నీ బిల్లుల చెల్లింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. ప్రభుత్వానికి పని చేసిన ప్రతి ఒక్కరూ కోర్టుకు వెళ్తే తప్ప బిల్లులు అందని పరిస్థితి ఏర్పడింది.
ఓ వైపు కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయదు. ఐఏఏస్ అధికారులు మాత్రం ధిక్కరణ కేసుల్లో జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తోంది., ఇప్పటిదాకా పరిస్థితి చూస్తే.. ఒక్కరంటే ఒక్క రెడ్డి సామాజికవర్గ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. రిజర్వుడు వర్గాలకు చెందిన ఐఏఎస్‌లకు ఎక్కువగా ఈ పరిస్థితి వస్తోంది. రెడ్డి వర్గ ఐఏఎస్‌లు .. కోర్టుల దాకా రాని.. ఎక్కువగా దోచుకునే శాఖలకు చీఫ్ లుగా ఉంటున్నారు. అది కూా డిప్యూటేషన్ పై వచ్చిన వారే. ఇక్కడ ఇరుక్కుపోతోంది మాత్రం ఏపీ సర్వీస్ ఇతర వర్గాల అధికారులు.