ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ప్రాజెక్ట్ కె`. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకీ స్థానం ఉందని, అయితే ఆమెది డీ గ్లామర్ పాత్ర అని, ఆ పాత్రలో సమంత కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలూ ఉంటార్ట. అయితే వాళ్లవి రెండే రెండు సీన్లున్న పాత్రలని, కాకపోతే… అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ఆ సీన్లు వస్తాయని సమాచారం. కాబట్టి… ఆ రెండు పాత్రలకూ పేరున్న హీరోలనే తీసుకోవాలని నాగ అశ్విన్ అనుకుంటున్నాడు. అమితాబ్ తో సీన్ కాబట్టే… ఆయా పాత్రలకు ఎవరిని అడిగినా ఓకే అంటారు. నాగ అశ్విన్ తో ఇది వరకు సినిమాలు చేసిన నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లని ఈ పాత్రలకు పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి, వేరే భాషల నుంచి ఇద్దరు పేరున్న హీరోలు కనిపించినా ఆశ్చర్యం లేదు. ఎలాగైనా సరే, ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మరో ఇద్దరు హీరోలు కనిపించడం ఖాయం.