ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడనున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. వీటికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. . జూలై 2వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉంది. వేరే వారు నామినేషన్లు వేసే అవకాశం లేదు. అందుకే పోటీ ఉండదు. ఏకగ్రీవం అవుతుంది.
ఇప్పుడు టీడీపీ తరపున ఎవరికి ఆ రెండు సీట్లు కేటాయిస్తారన్న చర్చ జరుగుతోంది. రెండు సీట్లు వైసీపీ ఎమ్మెల్సీలవి. టీడీపీలో చేరినందుకే పదవులు పోగొట్టుకున్నారు. పైగా ఈ ఎమ్మెల్సీలకు రెండేళ్ల పదవీ కాలమే ఉంటుంది. అందుకే రాజీనామాలు చేసిటీడీపీలో చేరిన వారికి ఇచ్చేస్తారని అంటున్నారు. అయితే రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. పిఠాపురం వర్మకు చాన్సిస్తారని అంటున్నారు.
అయితే ఎవరికి చాన్సిచ్చినా వాళ్లకు పదవీ కాలం రెండేళ్లే ఉంటుంది. అందుకే సీనియర్ నేతలు.. ఆశావహులు తమకు పూర్తి కాలం ఉన్న పదవి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా తర్వాత కొనసాగిస్తారన్న నమ్మకం ఉన్న వారే పోటీ పడుతున్నారు. మళ్లీ ఆ సమయంలో సామాజిక సమీకరణాలు చూసుకుని హ్యాండిస్తారని ఆందోళన పడేవారు మాత్రం పెద్దగా ప్రయత్నం చేయడం లేదు.