ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో తుపాకీ సంస్కృతి విజృంభిస్తోంది. పులివెందులకు అతి సమీపంగా ఉండే.. నల్లపురెడ్డి పల్లెలలో కాల్పులు చోటు చేసుకోవడంతో ఇద్దరు మరణించారు. ప్రసాద్ రెడ్డి, పార్థసారధి రెడ్డి అనే ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఏర్పడిన వివాదం చివరుకు కాల్పలకు దారి తీసింది. గొడవ తర్వాత ప్రసాద్ రెడ్డి గన్ తీసుకుని వచ్చి పార్థసారధిరెడ్డిని కాల్చేశారు. దాంతో ఆయన అక్కడిక్కకడే చనిపోయారు. ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన కూడా చనిపోయారు. ఈ కాల్పుల గొడవలకు రాజకీయాలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. వ్యాపార వ్యవహారాలు వ్యక్తిగత వివాదాలతోనే కాల్పులకు తెగబడ్డారని అనుమానిస్తున్నారు.
పులివెందుల సున్నితమైన ప్రాంతం. అయితే ఒకే పార్టీ ఆధిపత్యం చాలా కాలంగా ఉంది. గతంలో తుపాకులతో హల్ చల్ చేసిన చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ.. ఇలా కాల్చుకుని చంపేంత… చచ్చేంత సంఘటనలు గతలలో జరగలేదు. ఈ కారణంగానే కాల్పుల వ్యవహారం సంచలనం అవుతోంది. ప్రసాదరెడ్డికి అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతీ గ్రామం నుంచి వైసీపీ నేతలు.., తమ పలుకుబడితో.. తుపాకీ లైసెన్స్లు తెచ్చుకున్నారని.. భారీ ఖర్చుతో తుపాకీలు కొనుగోలు చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో కడపలో అనేక రకాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట…ఓ క్వారీలో డిటోనేటర్లు పేలి పది మంది దుర్మరణం పాలయ్యారు. ఆ కేసులో పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నారని తేలింది. పేలుళ్లు, కాల్పుల ఘటనలతో.. తరచూ కడప జిల్లాల నుంచి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.