బాహుబలి 2 హంగామా మొదలైపోయింది. త్వరలో ట్రైలర్‌ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న బాహుబలి 2 తెలుగు ట్రైలర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాజమౌళి రెండు ట్రైలర్లను కట్ చేసి ఉంచాడట. అందులో ఏది విడుదల చేయాలా?? అంటూ తర్జన భర్జనలు పడుతున్నాడట. ఒక్కో ట్రైలర్ నిడివి దాదాపు 140 సెకన్లు ఉందని.. రెండింటిలో ఏది వదలాలా అనేది ఇంకా తేల్చలేదని తెలుస్తోంది. మరోవైపు బాహుబలి 2 కోసం నాలుగు క్లైమాక్స్‌లు తెరకెక్కించారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ మాట కూడా నిజమే అని, ఈ నాలుగు క్లైమాక్స్ లూ చాలా బాగా వచ్చాయని.. ఏది ఫిక్స్ చేయాలన్న విషయంలో రాజమౌళి సైతం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడని.. బహుశా ప్రింట్లు పంపించేముందు ఫైనల్ వర్షన్‌ని డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.
మరోవైపు క్లైమాక్స్ విషయంలో రాజమౌళి ప్రభాస్, రానా, అనుష్కల అభిప్రాయాలు తెలుసుకొన్నాడని… ఎక్కువ మందికి నచ్చిన క్లైమాక్స్‌నే రాజమౌళి ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుగులో ఓ క్లైమాక్స్ హిందీలో మరో క్లైమాక్స్ ఫిక్స్ చేసే అవకాశాలూ లేకపోలేదు. అయితే.. అన్ని చోట్లా ఒకే క్లైమాక్స్ ఉంటే బాగుంటుంది కదా? అనే రాజమౌళి టీమ్ అభిప్రాయ పడుతోందట. చూద్దాం.. రాజమౌళి ఫైనల్ డిసీజన్ ఏంటో..??