తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… రాజకీయం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. కేసీఆర్‌కు సమ ఉజ్జిగా ఉంటుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి.. కేసీఆర్‌కు చతురంగబలాలు అండగా ఉంటాయి కాబట్టి… ప్రత్యర్థి పార్టీల నేతలను… ట్రాప్ చేయగలుగుతున్నారు. కానీ.. రేవంత్ రెడ్డి.. అవేమీ లేకుండానే.. ఓ ప్రకటనతో నేరుగా… కేటీఆర్‌ను ముగ్గులోకి లాగేశారు. రెండు రోజుల కిందట.. రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. దమ్ముంటే.. వాళ్లను ఆపుకోమని.. కేసీఆర్‌కు సవాల్ చేశారు. మీడియాలో ఇది బాగా హైలెట్ అయింది. సహజంగా ఇలాంటి వాటిని ఆయన పార్టీలు ఖండిస్తాయి. మైండ్ అని తీసి పడేస్తాయి. కానీ కేటీఆర్ మాత్రం అక్కడి వరకూ ఆలోచించలేదు.
ఎన్నికలకు ముందు ఇద్దరు ఎంపీలు పార్టీ మారితే… ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనుకున్నారేమో కానీ.. వెంటనే పార్టీ వర్గాల ద్వారా ఆరా తీస్తే… కొంత అసంతృప్తిగా ఉన్న ఎంపీల పేర్లు.. కొండా విశ్వేఏశ్వర్ రెడ్డి, సీతారాంనాయక్లుగా తేలాయి. ఇటీవల సీతారాంనాయక్ కొడంగల్ వెళ్లిరావడం… కొండావిశ్వేశ్వర్ రెడ్డి అసలు టీఆర్ఎస్కు ప్రచారం చేయకపోతూండటంతో… కేటీఆర్ పార్టీ మారబోతున్న ఎంపీలు వీరిద్దరేనని నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు. వారిద్దర్నీ ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. వారిద్దరూ తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్పారు. అదే విషయాన్ని మీడియాకు చెప్పమని కేటీఆర్ సూచించారు. వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి రేవంత్ పై మండిపడ్డారు. తన పాచిక పారినందుకు రేవంత్ రెడ్డి… సంతోషపడ్డారు. వెంటనే మీడియా ముందుకు వచ్చి.. అసలు.. ఇద్దరు ఎంపీలు అన్నారు కానీ.. వాళ్లిద్దరూ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాంనాయక్లని నేను ఎప్పుడు చెప్పానని ప్రశ్నించారు. కేటీఆర్ వారిద్దరిపై అనుమానం వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. కవిత, వినోద్‌లు ఆ ఇద్దరు ఎంపీలు ఎందుకు కాకూడదు .. మరో రాయి వేశారు. దీంతో నాలికకరుచుకోవడం టీఆర్ఎస్ ఎంపీల వంతయింది.
రేవంత్ ట్రాప్‌లో కేటీఆర్ ఇంత సులువుగా పడి.. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల్ని అనుమానిస్తారని.. ఇద్దర్నీ పిలిచి వివరణ అడుగుతారని.. ఎవరూ ఊహించలేకపోయారు. కానీ అడిగేశారు. దీన్ని అంది పుచ్చుకున్న రేవంత్ రెడ్డి… మరింత ముందుకెళ్లారు. కచ్చితంగా రెండు వికెట్లు పడతాయని… తేల్చి చెప్పారు. అదీ కూడా.. పోలింగ్‌కు ముందే చేరుతారని… ప్రకటించారు. మరి రేవంత్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది…మైండ్ గేమా..? లేక నిజంగానే ఉన్నారా.? అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ రేపుతున్న అంశం.