రెండేళ్ల కిందట తెలుగుదేశం మళ్లీ గెలుస్తుందా?. జగన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి వేసిన కేసుల వల నుంచి బయటపడగలరా ?. పార్టీ నేతలు ప్రజల్లోకి రాలేకపోతున్నారు… వారిని ఎలా యాక్టివ్ చేస్తారు ?. అనే సందేహాల మధ్య క్యాడర్ సతమతమవుతూ ఉండేది. నాయకత్వం గంభీరంగా ఉన్నా… ఎలాంటి ఇబ్బందులు పడినా.. పెడుతున్నా నిబ్బరంగా ముందుకు కదులుతూ ఉన్నా… క్యాడర్,లీడర్‌కు ఎక్కడో బెరుకు. అప్పుడే నారా లోకేష్ రంగంలోకి దిగారు. యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంతే టీడీపీ క్యాడర్లో ఉన్న సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఖచ్చితంగా గెలిచేది టీడీపీనే అని వంద శాతం నమ్మకాన్ని కలిగించడంలో యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది. అలాంటి నమ్మకం కలిగించడానికి లోకేష్ పడిన శ్రమను మాటల్లో వర్ణించడం కష్టం.
లోకేష్ ఇమేజ్ను సమూలంగా మార్చేసిన యువగళం
నారా లోకేష్‌పై రాజకీయ. ప్రత్యర్థులు ఆయన రాజకీయాల్లోకి రాక ముందు ఓ భయంకరమైన కుట్ర చేశారు. విద్యాధికుడికి రాజకీయాల్లో ఉండే హక్కు లేదన్నట్లుగా.. రౌడీలు, దొంగలు , ఖూనీకోర్లు, క్విడ్ ప్రో కో స్టార్లు మాత్రమే రాజకీయంగా సూపర్ స్టార్లు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేశారు. నారాలోకేశ్‌ను పప్పు అంటూ ప్రచారం చేశారు. ఆయన ఎక్కడైనా మాట తడబడితే చాలు కోట్లు వెచ్చించి వైరల్ చేసేవారు. రాజకీయంగా నారా లోకేశ్‌ను ఇలా టార్గెట్ చేసిన సమయంలో ..యువగళాన్ని ఎంచుకున్నారు. తన ఇమేజ్ ను మార్చుకుంటూ.. పార్టీ రాత మార్చడానికి ప్రయత్నించారు. అనుకున్న ఫలితం సాధించారు.
జగన్ రెడ్డి ఎంత అణిచివేయాలనుకుంటే అంతగా ఎదిగిన యువగళం
యువగళాన్ని అణిచివేసేందుకు జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఇంటలిజెన్స్ పోలీసులు, సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా టీం కనీసం వెయ్యి మంది ఆ యువగళంగా ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచేవారు. ప్రతి అడుగును ఇంటలిజెన్స్ పోలీసులు చిత్రీకరించి వైసీపీ సోషల్ మీడియా ఆఫీసుకు పంపేవారు. పాదయాత్ర ఇంకా ఫలానా ఊరికి రాక ముందే జనాల్లేరని చెప్పేవారు. ట్రోల్ చేసేవారు. అంతే కాదు ఓ చీకటి జీవో తెచ్చి అది కోర్టులో నిలబడదని తెలిసినా తీర్పు పెండింగ్ లో ఉందని చెప్పి కనీసం మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు. మైకులు లాక్కునేవారు పోలీసులు. ఆయన అందరికీ కనిపించేలా కాస్త స్టూల్ పై నిలబడి బిగ్గరగా మాట్లాడుతున్నారని స్టూల్ కూడా లాక్కెళ్లిపోయేవారు. కింది స్థాయిలోనే ఇంత స్థాయిలో ఒత్తిళ్లు పెట్టారంటే.. ఇక పై స్థాయిలో ఎన్ని కుట్రలు చేసి ఉంటారో చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబును అరెస్టు చేసి యువగళాన్ని నొక్కేయాలన్న ప్రయత్నాన్నీ విఫలం చేసిన లోకేష్
యువగళంగా దిగ్విజయంగా సాగుతున్న సమయంలో… రాష్ట్రంలో ప్రజల మూడ్ అంతా మారిపోయిందని అర్థం కావడంతో .. చివరి ప్రయత్నంగా చంద్రబాబును అరెస్టు చేసింది జగన్ రెడ్డి సర్కార్. కర్నూలులో ఆయన రాజకీయ పర్యటనలో ఉండగానే అర్థరాత్రి అరెస్టు చేశారు. నారా లోకేష్ తప్పనిసరిగా పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. కానీ అలా చేయడం కొరివితో తల గోక్కున్నట్లుగానే అయిందని తేలింది. పాదయాత్రతో ప్రజల్లో లోకేష్ ఇమేజ్ పెరిగిపోగా.. చంద్రబాబు ను జైల్లో పెట్టిన తర్వాత జగన్ రెడ్డి నిర్వాకాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తన సమర్థతను నిరూపించుకున్నారు. జాతీయ నేతలతో లోకేష్ కు మంచి పరిచయాలు.. అభిమానం ఏర్పడటానికి కారణం అయింది. సిక్కోలు వరకూ సాగాలనుకున్న పాదయాత్రను విశాఖలోనే ముగించినా.. అప్పటికే లక్ష్యాన్ని సాధించేశారు. వైసీపీని భూస్థాపితం చేసేశారు. జగన్ రెడ్డి అసెంబ్లీ వైపు చూడాలంటే భయపడేలా చేశారు. దానికి ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా నిలిచాయి.
టీడీపీ చరిత్రలో యువగళానికి ప్రత్యేక పాత్ర
నారా లోకేష్ ను ఒకప్పుడు ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు నిప్పు. ఎంతగా అంటే… ఆయనేం చేస్తాడో.. తమ అక్రమాలు ఎక్కడబయట పెట్టి లోపలికి పంపుతాడోనని వైసీపీలోని సగం మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కలలోనూ వారికి రెడ్ బుక్ కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీకి తదుపరి నాయకత్వాన్ని యువగళం అందించింది. పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్న నమ్మకాన్ని కలిగించింది. అందకే టీడీపీ చరిత్రలో యువగళం పాదయాత్రకు ప్రత్యేక అధ్యాయం ఉంటుంది.